Jair Bolsonaro: బ్రెజిల్ అధ్యక్షుడికి కరోనా

Jair Bolsonaro: కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరిపైన కరోనా తన ప్రభావాన్ని చూపిస్తోంది.

Update: 2020-07-07 16:45 GMT

Jair Bolsonaro: కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరిపైన కరోనా తన ప్రభావాన్ని చూపిస్తోంది. తాజాగా బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో కరోనా బారినా పడ్డారు. ఈ విషయాన్నీ మంగళవారం ఆయనే స్వయంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం కరోనా తేలిక లక్షణాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. మార్చిలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో జరిగిన భేటి అనంతరం బోల్సోనారోకు మూడుసార్లు కరోనా పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షలో ఆయనకి నెగిటివ్ అని తేలింది. అయితే తాజాగా చేసిన పరీక్షలో మాత్రం ఆయనకి కరోనా పాజిటివ్ అని తేలింది.

ఇక కరోనా కేసులు పెరుగుతున్న దేశాలలో బ్రెజిల్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఈ దేశాల జాబితాలో బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా మొదటి స్థానంలో అమెరికా నిలిచింది. ఇప్పటివరకు 65,000 మందికి పైగా బ్రెజిలియన్లు మరణించగా 1,500,000 మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు. ఇక అటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి 11,837,245కి చేరుకుంది.


Tags:    

Similar News