Brazil President Jair Bolsonaro : ఎట్టకేలకు కోలుకున్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో

Brazil President Jair Bolsonaro : రెండు వారాల చికిత్స తర్వాత తన నివేదిక తిరిగి నెగెటివ్‌గా వచ్చిందని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో శనివారం వెల్లడించారు.

Update: 2020-07-25 16:16 GMT

Brazil President Jair Bolsonaro : రెండు వారాల చికిత్స తర్వాత తన నివేదిక తిరిగి నెగెటివ్‌గా వచ్చిందని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో శనివారం వెల్లడించారు. ఆయన మూడవ నివేదిక జూలై 21న కూడా పాజిటివ్ గా ఉంది. అంతకుముందు జూలై 14 న జరిగిన పరీక్షలో కూడా పాజిటివ్ వచ్చింది. బోల్సోనారో జూలై 7 న కరోనా యొక్క తేలికపాటి లక్షణాలను కలిగి ఉన్నానని ప్రకటించారు. దాంతో అదేరోజు ఆయనకు టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో అప్పటినుంచి హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యకలాపాలన్నిటిని పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు చేస్తూ.. కరోనా భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పుకొచ్చారు.

ఇక బ్రెజిల్ లో కరోనా విజృంభణ ఆగడం లేదు. గ‌త 24 గంట‌ల్లో 55,891 క‌రోనా కేసులు కొత్త‌గా న‌మోద‌య్యాయి. దీంతో దేశం‌లో ఇప్ప‌టివ‌ర‌కు 23,43,366 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. మొత్తం న‌మోదైన కేసుల్లో 15,90,264 మంది కోలుకున్నారు. శుక్ర‌వారం కొత్త‌గా 1156 మంది మ‌ర‌ణించ‌డంతో మొత్తం మృతుల సంఖ్య 85,238కి పెరిగింది. కరోనాకు అత్యధికంగా ప్రభావితమైన దేశంగా యునైటెడ్ స్టేట్స్ తరువాత బ్రెజిల్ నిలిచింది. ఇక్కడ కరోనావైరస్ కేసులు పెరుగుతున్నప్పటికీ లాక్ డౌన్ సడలింపులు ఇచ్చారు. దీంతో అధ్యక్షుడు జైర్ బోల్సోనారో పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.  



Tags:    

Similar News