Afghanistan: ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్లకు ఊహించని ఎదురుదెబ్బ

* తాలిబన్ల వాహనాలు లక్ష్యంగా మందు పాతరల పేలుడు * ముగ్గురి మృతి.. మరో 20 మందికి తీవ్రగాయాలు * నంగర్ హర్ ప్రావిన్స్ లో ఘటన

Update: 2021-09-18 16:30 GMT

ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్ల పై బాంబు దాడి(ట్విట్టర్ ఫోటో)

Afghanistan: ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్లకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. వారి వాహనాలు లక్ష్యంగా వరుస పేలుళ్లు జరిగాయి. నంగర్ హర్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్ లో రోడ్డు పక్కన అమర్చిన మందు పాతరలు హటాత్తుగా పేలడంతో ముగ్గురు తాలిబన్లు అక్కడికక్కడే చనిపోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే గాయపడిన వారిలో ఎక్కువ మంది ఆప్ఘన్ పౌరులే ఉన్నారు. మరోవైపు కాబూల్ లోనూ బాంబు పేలుడు జరిగింది. సాధారణంగా తాలిబన్లు సాధారణ పౌరులపై ఇలా దాడులుచేస్తుంటారు. కానీ ఈసారి తాలిబన్లపైనే దాడి జరగడంతో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. దాడి చేసినదెవరన్నది ఇప్పటి వరకూ తెలియరాలేదు.

Tags:    

Similar News