Britain: గాలిలో ఎగిరే నౌకలు
Britain: ఇక్కడ నౌకలు గాల్లో ఎగురుతాయి. చిన్న చిన్నవే కాదు.. అత్యంత భారీ నౌకలు కూడా గాల్లో తేలుతూ కనిపిస్తాయి.
Britain: ఇక్కడ నౌకలు గాల్లో ఎగురుతాయి. చిన్న చిన్నవే కాదు.. అత్యంత భారీ నౌకలు కూడా గాల్లో తేలుతూ కనిపిస్తాయి. అలా తేలుతున్న నౌకలను కళ్లతో చూడటమే కాదు, ఫొటోలూ తీసుకోవచ్చు ఇదేం వింత అనుకుంటున్నారా? అంతా వాతావరణం మహిమ అంటున్నారు శాస్త్రవేత్తలు. వాతావరణంలో కొన్ని ప్రత్యేకతలతో ఏర్పడే దృష్టి భ్రమ దీనికి కారణం అంటున్నారు. వేసవిలో కనిపించే ఎండమావుల లాంటి పరిస్థితిగా చెప్పవచ్చు.
సముద్రంలో దూరంగా ఉన్న నౌకలు గాల్లో తేలుతున్నట్టుగా కనిపించే ఈ దృష్టి భ్రమను ఫటా మోర్గానా అంటారు. నౌకలేకాదు దూరంగా సముద్రం కూడా కొంత పైకి లేచినట్టుగా అనిపిస్తుంటుంది. పలుచోట్ల సముద్ర తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను బట్టి కాస్త అరుదుగా ఈ తరహా దృష్టి భ్రమ కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిపించిన ఈ దృశ్యాల్ని బీచ్‌కు వెళ్ళినవారు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారాయి.