Bill Gates సంచలన నిర్ణయం..27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి
Bill Gates: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Bill Gates: ప్రపంచ అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భార్య మిలిండా గేట్స్‌కు విడాకులు ఇవ్వనున్నట్లు ప్రటించారు. ఈ మేరకు విడాకుల విషయాన్ని ఆయన అధికారికంగా ట్విటర్‌లో వెల్లడించారు. ఎన్నో సమాలోచనలు., ఎంతో మథనం తర్వాత మా దాంపత్య బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయానికి వచ్చాం. అని ట్విటర్లో పెర్కొన్నారు.
గత 27 ఏళ్లలో మా జీవితం అద్బుతంగా సాగింది. మా పిల్లలను తీర్చిదిద్దాం. దాంతోపాటు ప్రపంచలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, నిర్మాణాత్మకంగా ఎదిగేలా మా ఫౌండేషన్ ద్వారా కృషి చేశాం. కొత్త ప్రపంచంలోకి మేం వెళ్లేందుకు వీలుగా, మా వ్యక్తిగత ఆకాంక్షలను, మా విడాకుల నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం..ఈ మిషన్‌లో మా భాగస్వామ్యం ఎప్పటికీ కొనసాగుతుంది. కానీ భార్యాభర్తలుగా ఇక కొనసాగలేమని భావించాం. అని ట్విటర్లో బిల్ గేట్స్ దంపతులు పేర్కొన్నారు.
బిల్‌గేట్స్ వయసు 65 ఏళ్లు కాగా, మెలిందా వయసు 56 ఏళ్లు. మైక్రోసాఫ్ట్ ను ఏర్పాటు చేసిన తరువాత.. 1987 మిలిందా మైక్రోసాఫ్ట్ కంపెనీ లో జాయిన్ అయ్యారు. ఆ తరువాత 1994 లో బిల్ గేట్స్, మిలిందా గేట్స్ లు వివాహం చేసుకున్నారు. 54 బిలియన్ డాలర్ల విలువైన గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారు. ఫౌండేషన్ విషయంలో ఎలాంటి విబేధాలూ లేకుండా ఇకపైనా కలిసే పనిచేస్తామనీ… సంస్థను కొనసాగిస్తామని తెలిపారు
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడిగానే కాకుండా పలు ధార్మిక కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న ఈ జంట విడిపోవటం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బిగ్ గెట్స్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారని చర్చించుకుంటున్నారు.