Supermoon 2022: ఆకాశంలో ఇవాళ భారీ చంద్రుడు

Supermoon 2022: ఈ ఏడాది బిగ్‌ మూన్‌ కనిపించడం మూడోసారి

Update: 2022-07-13 11:00 GMT

Supermoon 2022: ఆకాశంలో ఇవాళ భారీ చంద్రుడు

Supermoon 2022: ఇవాళ ఆకాశంలో అద్భుత దృశ్యం నెలకొననున్నది. నేటి పౌర్ణమి రాత్రి కనిపించే చంద్రుడి కంటే ఇవాళ అత్యంత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. ఈ ఏడాది మొత్తం నాలుగు సార్లు చంద్రుడు అతిపెద్దగా కనిపించనున్నాడు. తాజాగా మూడోసారి బిగ్‌ మూన్‌ సాక్షత్కారం కానున్నట్టు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలిపింది. చివరి బిగ్‌ మూన్‌ ఆగస్టు 12న కనిపించనున్నట్టు తెలిపింది. సాధారణంగా జులైలో చంద్రుడు తన కక్షలో భూమికి అతి దగ్గరగా రావడంతో బిగ్‌ మూన్‌లా కనిపిస్తున్నట్టు నాసా తెలిపింది. ఈసారి భారీ పరిణామంలో కనిపించే చంద్రుడు మూడ్రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వీక్షించవచ్చని నాసా వివరించింది.

సాధారణంగా జూలైలో పెద్దగా కనిపిస్తున్నందున సూపర్‌ మూన్‌ను జూలై మూన్‌ అని పిలుస్తారు. జూలైలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నందున థండర్‌ మూన్‌ అని కూడా కొందరు పిలుస్తారు. దీన్ని బక్‌ మూన్‌ అని మరి కొందరు పిలుస్తారు. బక్‌ అంటే బగ జింక. సాధారణంగా మగ జింక కొమ్ములు తొలగిస్తాయి. జూలై నుంచే మగ జింకల కొమ్ములు పెరగడం ప్రారంభమవుతుంది. అందుకే సూపర్‌ చంద్రడిని బక్‌ మూన్‌ అని అంటారు. ఈ సూపర్‌ మూన్‌ భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 12 గంటల 8 నిమిషాలకు కనిపించనున్నది. థండర్‌ మూన్‌ వరుసగా మూడ్రోజుల పాటు పూర్తిగా కనిపిస్తుందని నాసా తన అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది. 

Tags:    

Similar News