మరో నాలుగు రాష్ట్రాల ప్రైమరీల్లో బైడెన్, ట్రంప్ విజయం
America: రిపబ్లిక్ పార్టీ సభ్యుల్లో 75శాతం ట్రంప్‌కు మద్దతు
America: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థులుగా జో బైడెన్, డోనాల్డ్ ట్రంప్ మరోమారు తలపడుతున్నారు. మరో నాలుగు రాష్ట్రాల ప్రైమరీల్లో వీరు వారి వారి పార్టీల నుంచి విజయం సాధించారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ డెమోక్రాట్ పార్టీ ఎన్నికల్లో, మాజీ అధ్యక్షుడు ట్రంప్ రిపబ్లికన్ పార్టీ ఎన్నికల్లో...రోడ్ ఐలాండ్, కనెక్టికట్, న్యూయార్క్, విస్కాన్‌సిన్ రాష్ట్రాల ప్రైమరీల్లో గెలుపొందారు. వారి సొంత పార్టీల్లో కొందరు బరిలో ఉన్నప్పటికీ బైడెన్, ట్రంప్‌లకు ఎవరూ గట్టి పోటీనివ్వలేకపోయారు.
ట్రంప్‌నకు రిపబ్లికన్ పార్టీ సభ్యుల్లో 75శాతం మంది మద్దతివ్వగా, బైడెన్‌ను డెమోక్రాట్ ఓటర్లలో 80 శాతానికి పైగా సమర్థించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబరు 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ప్రత్యర్థులుగా బైడెన్, ట్రంప్‌ల పేర్లు ఖరారు కానున్నాయి. రిపబ్లికన్లు తమ అధ్యక్ష అభ్యర్థిని జులైలో మిల్వాకీలో జరిగే ఆ పార్టీ జాతీయ సదస్సులో, డెమోక్రాట్లు ఆగస్టులో షికాగోలో జరిగే ఆ పార్టీ జాతీయ సదస్సులో అధికారికంగా ప్రకటిస్తారు.