Nasal Spray: కోవిడ్‌పై పోరాటానికి మరో కొత్త ఆయుధం
Nasal Spray: కోవిడ్‌పై పోరాటంలో మరో కొత్త ఆయుధాన్ని ఆస్ట్రేలియా సైంటిస్టులు సిద్ధం చేస్తున్నారు.
Nasal Spray: కోవిడ్‌పై పోరాటంలో మరో కొత్త ఆయుధాన్ని ఆస్ట్రేలియా సైంటిస్టులు సిద్ధం చేస్తున్నారు. రక్తం పలుచబడేందుకు వినియోగించే మెడిసిన్ అయిన హెపరిన్‌ను నేజల్ స్ప్రేగా పరీక్షించారు. ఇప్పటికే ఓ కోవిడ్ పేషెంట్‌పై హెపరిన్ నేజల్ స్ప్రే ప్రయోగించామని, ఆ తర్వాత అతడిలో కోవిడ్ మళ్లీ రిపీట్ అయిన దాఖలాలు లేవని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఈ పరిశోధనలు 2022 రెండోభాగంలో పూర్తయ్యే అవకాశాలున్నాయన్నారు. కోవిడ్ సోకిన ప్రారంభ దశలో నేజల్ స్ప్రే ఉపయోగ పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.