ఆస్ట్రేలియా ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం.. కొత్త ప్రధాని అల్బో...
Australia: 151 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ 72 స్థానాల్లో విజయం...
Australia: ఆస్ట్రేలియా పార్లమెంట్ ఎన్నికల్లో లిబరల్-నేషనల్ కూటమిపై లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. కొత్త ప్రధానమంత్రిగా ఆంటోనీ అల్బనీస్ ఎన్నికయ్యారు. మొత్తం 151 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ 72 స్థానాల్లో గెలుపొందింది. స్కాట్ మారిసన్ ఆధ్వర్యంలోని లిబరల్-నేషనల్ కూటమి కేవలం 52 స్థానాలకే పరిమితమయ్యాయింది. ఇక ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపొందారు.
దీంతో ఆస్ట్రేలియాకు 31వ ప్రధానమంత్రిగా ఆంటోని అల్బనీస్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాని స్కాట్ మారిసన్ అంగీకరించారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్టు వెల్లడించారు. కొత్తగా ప్రధాని బాధ్యతలు చేపట్టబోయే అల్బనీస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 2007 తరువాత లేబర్ పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చింది. 2019 నుంచి ఆ పార్టీకి చెందిన అల్బనీస్ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. 1963లో జన్మించిన అల్బో.. 1996లో తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.
గత మూడేళ్లలో కరోనా విజృంభణ, వాతావరణ మార్పులు కారణంగా ఏర్పడిన విపత్తులను ఎదుర్కొనడంలో అధికార పార్టీ వైఫల్యం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచింది. మూడేళ్లకోసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో లిబరల్-నేషనల్ కూటమి కంటే లేబర్ పార్టీ మెరుగైన హామీలను ఇచ్చి.. ప్రజల విశ్వాసాన్ని దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా ప్రధానిగా ఎన్నికైన అల్బనీస్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. అల్బనీస్ సర్కారుతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇరు దేశాల ప్రయోజనాలపై కలిసి కట్టుగా పోరాడుదామని ప్రధాని పిలుపునిచ్చారు.