Canada: కెనడాలో ఖలిస్తానీల భీభత్సం, హిందూ దేవాలయంతోపాటు, భక్తులపై కర్రలతో దాడి
Canada: కెనడాలోని బ్రాంప్టన్‌లో ఖలిస్తానీలు బీభత్సం సృష్టించారు. ఖలిస్తాన్ మద్దతుదారులు ఆలయంలోకి ప్రవేశించి కర్రలతో భక్తులపై దాడి చేశారు.
Canada: కెనడా ప్రభుత్వం భారత్‌పై విషం చిమ్మిన తర్వాత అక్కడి ఖలిస్తానీలు రెచ్చిపోతున్నారు. నిన్న కెనడాలోని బ్రాంప్టన్‌లో ఖలిస్తానీలు హిందూదేవాలయంపై దాడికి పాల్పడ్డారు. బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయం వెలుపల ఖలిస్తాన్ మద్దతుదారులు తీవ్ర రగడ సృష్టించారు. ఖలిస్తాన్ మద్దతుదారుల నిరసన సమయంలో, కొంతమంది నిరసనకారులు కర్రలతో కొంతమందిపై దాడి చేశారు. ఆలయ మైదానంలోకి కూడా ప్రవేశించి భక్తులపై దాడికి పాల్పడ్డారు.
కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై జరిగిన దాడిపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. ట్రూడో మాట్లాడుతూ - "బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంలో జరిగిన హింసాత్మక సంఘటనలు ఆమోదయోగ్యం కాదు. ప్రతి కెనడియన్‌కు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా ఆచరించే హక్కు ఉంది. సమాజాన్ని రక్షించడానికి, ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తున్నాను అంటూ తెలిపారు.
కెనడాలోని ఖలిస్తానీ తీవ్రవాదులు రెడ్ లైన్ దాటిపోయారని కెనడా పార్లమెంటులో భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆచార్య అన్నారు. ఆలయ సముదాయంలో హిందూ-కెనడియన్ భక్తులపై జరిగిన దాడి కెనడాలో ఖలిస్థానీ హింసాత్మక తీవ్రవాదం ఎంత లోతుగా నిస్సిగ్గుగా చూపిస్తుందన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ కింద కెనడాలో ఖలిస్తాన్ తీవ్రవాదులకు స్వేచ్చ లభిస్తోందని వ్యాఖ్యానించారు.