Space News: భూమికి అత్యంత దగ్గరగా భారీ గ్రహశకలం

Space News: భారీ గ్రహశకలం ఒకటి భూమికి అత్యంత సమీపంలోకి వస్తోందని అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Update: 2022-05-13 14:15 GMT

Space News: భూమికి అత్యంత దగ్గరగా భారీ గ్రహశకలం

Space News: భారీ గ్రహశకలం ఒకటి భూమికి అత్యంత సమీపంలోకి వస్తోందని అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆస్ట్రాయిడ్ 388945గా వ్యవహరిస్తోన్న ఈ శకలం మే 16 అర్థరాత్రి సమయంలో భూమికి దగ్గరగా వస్తుందని తెలిపారు. ఈ గ్రహ శకలం దాదాపు 1,608 అడుగుల వెడల్పు ఉందని తెలిపారు. అంటే న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే పెద్దదిగా ఉంటుందని తెలిపారు.

ఈ గ్రహశకలం భూమిని తాకితే భారీ నష్టం వాటిల్లుతుందని అయితే ఇది భూమికి 25 లక్షల మైళ్ల దూరం నుంచి వెళ్లిపోవచ్చని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ఆస్ట్రాయిడ్ భూమికి దగ్గరగా వెళ్లడం ఇదే తొలిసారి కాదని 2020 మే నెలలో సైతం 17 లక్షల మైళ్ల దూరం నుంచి వెళ్లిపోయింది. ప్రతీ రెండేళ్లకోసారి భూమికి అత్యంత సమీపం నుంచి వెళ్లుతుంది. మళ్లీ 2024లో భూమికి అత్యంత సమీపంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

Tags:    

Similar News