పాకిస్తాన్ కు తొలి గోల్డ్ మెడల్ సాధించిన కుర్రాడు... దేశం జెండా భుజం మీద వేయగానే దుఃఖం ఆపుకోలేకపోయాడు...

జావెలిన్ త్రోలో ప్రపంచ రికార్డ్ సృష్టించి స్వర్ణం గెల్చుకున్న అర్షద్ నదీమ్.. పాకిస్తాన్ జెండాను భుజాల మీద కప్పగానే దుఃఖం ఆపుకోలేకపోయాడు…

Update: 2024-08-09 11:59 GMT

Image Credit( Aman Sharma X)

‘నాకున్నది ఒకే ఒక స్పాన్సర్. అది మా నాన్న.’ ఇది అర్షద్ నదీమ్ ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన మాట.

రూ. 80,000 పెట్టి ఒక కొత్త జావెలిన్ కూడా కొనుక్కునే స్తోమత లేని కుర్రాడు.. పారిస్ ఒలింపిక్స్-2024లో ప్రపంచ రికార్డ్ సృష్టించాడు.

పాకిస్తాన్ కు గత 32 ఏళ్ళలో తొలి ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధించాడు.

జావెలిన్ త్రోలో ప్రపంచ రికార్డ్ సృష్టించి స్వర్ణం గెల్చుకున్న అర్షద్ నదీమ్.. పాకిస్తాన్ జెండాను భుజాల మీద కప్పగానే దుఃఖం ఆపుకోలేకపోయాడు…

ఎన్నో కష్టాలకోర్చి సాధించిన కల.. అతడ్ని నిలువునా దుఃఖంలో ముంచెత్తింది.

హ్యాట్సాప్ అర్షద్..

విష్ యూ ఆల్ ది బెస్ట్!

Tags:    

Similar News