Pakistan: పాకిస్థాన్‌లో భూమి కోసం భీకర హింస..36 మంది మృతి,162 మంది గాయాలు

Pakistan: వాయువ్య పాకిస్తాన్ లోని గిరిజన తెగల మధ్య జరిగిన భీకర పోరులో 36 మంది మరణించారు. దాదాపు 162 మంది గాయపడ్డారు. అఫ్ఘానిస్తాన్ సరిహద్దులో ఉన్న ఖైబర్ పంఖ్తుంక్వాలోని బొషేరా గ్రామంలో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి.

Update: 2024-07-29 03:13 GMT

Pakistan: పాకిస్థాన్‌లో భూమి కోసం భీకర హింస..36 మంది మృతి,162 మంది గాయాలు

Pakistan: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ పరిస్థితి ఇప్పుడు మరింత దారుణంగా తయారైంది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలో రెండు గిరిజన గ్రూపుల మధ్య తీవ్ర హింస చోటుచేసుకుంది. ఈ హింసాకాండలో ఇప్పటివరకు 36 మంది మరణించారు. 162 మంది గాయపడ్డారు. ఐదు రోజుల క్రితమే ఇరువర్గాల మధ్య భీకర ఘర్షణలు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘర్షణలో ఆయుధాలు కూడా ఉపయోగించినట్లు వెల్లడించారు.

పాకిస్తాన్ స్థానిక అధికారులు తెలిపిన ప్రకారం, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కుర్రం జిల్లాలో ఒక చిన్న భూమి గురించి రెండు గిరిజన సమూహాల మధ్య ఈ సాయుధ పోరాటం ప్రారంభమైంది. హింసాకాండలో 36 మంది మరణించగా, 162 మంది గాయపడ్డారు. గ్రామంలో గతంలో తెగలు, మత సమూహాల మధ్య ఘోరమైన ఘర్షణలు, అలాగే మత ఘర్షణలు, తీవ్రవాద దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు. గిరిజన పెద్దలు, సైనిక నాయకత్వం, పోలీసులు, జిల్లా యంత్రాంగం సహకారంతో బోషెరా, మలికెల్, దుందర్ ప్రాంతాల్లో షియా, సున్నీ తెగల మధ్య కొంతకాలం క్రితం ఒప్పందం కుదిరిందని అధికారులు తెలిపారు.

అయితే జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. అదే సమయంలో, మిగిలిన ప్రాంతాల్లో కూడా కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక అధికారి తెలిపారు. గత రాత్రి నుంచి రెండు తెగల మధ్య నాలుగు సార్లు గొడవలు జరిగాయని, దీని కారణంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హింసాకాండ దృష్ట్యా అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. పగటిపూట కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా బలగాలను పెద్దఎత్తున మోహరించారు.

Tags:    

Similar News