Yahya Sinwar: యాహ్యా సిన్వార్ మరణంపై నెట్టింట వైరల్గా మారిన ఇజ్రాయెల్ సైనికుడి స్పందన..ఏమన్నాడంటే..?
Yahya Sinwar: హమాస్ అధినేత యాహ్వా సిన్వార్ మరణంపై ఇజ్రాయెల్ కు చెందిన ఓ సైనికుడు చేసిన పోస్టులు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. సిన్వార్ ను చంపేందుకు ఆపరేషన్ లో పాల్గొన్న ఇజ్రాయెల్ సైనికుడు..మిషన్ అనంతరం సిన్వార్ డెడ్ బాడీతో ఒంటరిగా గడిపిన సమయాన్ని వివరించాడు.
Yahya Sinwar: హమాస్ అధినేత యాహ్వా సిన్వార్ మరణంపై ఇజ్రాయెల్ కు చెందిన ఓ సైనికుడు చేసిన పోస్టులు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. సిన్వార్ ను చంపేందుకు ఆపరేషన్ లో పాల్గొన్న ఇజ్రాయెల్ సైనికుడు..మిషన్ అనంతరం సిన్వార్ డెడ్ బాడీతో ఒంటరిగా గడిపిన సమయాన్ని వివరించాడు.
గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై మారణకాండకు సూత్రధారి అయిన హమాస్ మిలిటెంట్ సంస్థ అధినేత యాహ్వా సిన్వార్ ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిన్వార్ ను హతమార్చిన ఆపరేషన్ లో పాల్గొన్న ఇజ్రాయెల్ సైనికుడు ఒకరు..అతని డెడ్ బాడీ వద్ద ఒంటరిగా ఉన్న క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
సిన్వార్ మరణించిన తర్వాత అతని డెడ్ బాడీ దగ్గర ఒంటరిగా గడిపినప్పుడు శిథిలమైన నగరాన్ని ఒక్కసారి చూశాను. అతని డెడ్ బాడీని చూడగానే కొద్దిసేపు బాధ కలిగింది. ఎందుకంటే అతడూ ఒకప్పుడు ఏమీ తెలియని చంటిపిల్లవారు. కానీ వయస్సు పెరిగే క్రమంలో చెడు మార్గాన్ని ఎంచుకున్నట్లు అనిపించింది. కానీ అతని మరణం ప్రపంచానికి ఎంతో మేలు చేస్తుంది. మేము కలిసి పోరాడతాం..గెలుస్తామని లెఫ్టినెంట్ కల్నల్ ఈథమ్ తన పోస్టులో పేర్కొన్నారు.
గతఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై జరిపిన దాడులకు యాహ్యా సిన్వార్ సూత్రధారి. ఈ ఘటనలో 1200 మంది ఇజ్రాయెల్ వాసులు చనిపోయారు. 250 మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకెళ్లారు. దీంతో సిన్వార్ జాడ తెలుసుకునేందుకు ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో దక్షిణ గాజాలోని రఫా నగరంలో బుధవారం ముగ్గురు హమాస్ మిలిటెంట్లును ఇజ్రాయెల్ అంతమొందించింది.
ఇందులో ఓ వ్యక్తికి సిన్వార్ పోలికలు ఉన్నాయని గుర్తించిన ఐడీఎఫ్..అతని డీఎన్ఏ, దంత నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించింది. గతంలో అతను ఇజ్రాయెల్ కస్టడీలో ఉన్న సమయంలో సేకరించిన డీఎన్ ఏ నమూనాలతో వాటిని టెస్టు చేశాము. అతని మరణాన్ని ధ్రువీకరించింది. అతని మరణాన్ని హమాస్ కూడా ధ్రువీకరించింది.