US Election 2024: రేపే అమెరికా అధ్యక్ష ఎన్నికలు..సర్వేలు ఏం చెబుతున్నాయంటే?

US Election 2024: అమెరికా అధ్యక్షలు ఎంతో ఉత్కంఠను పెంచాయి. ఎవరు గెలుస్తారనేది అంచనాలకు అందట్లేదు. సర్వేలు వెంటవెంటనే మారుతున్నాయి. ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుత్తున్నారో తెలియడం లేదు. రేపే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి పూర్తి పరిస్థితిని తెలుసుకుందాం.

Update: 2024-11-04 01:27 GMT

 US Election 2024: డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్..ఈ రెండు పేర్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతున్నాయి. వీరిద్దరిలో ఎవరు అమెరికా అధ్యక్షులు అవుతారనే ఆసక్తి నెలకొంది. ట్రంప్ వస్తే రెండోసారి ఆయన అధ్యక్షులు అవుతారు. పైగా ఆయనపై జరిగిన హత్యాయత్నం ఆయనకు సానుభూతి ఓట్లను ఇచ్చినట్లు అవుతుంది. అదే కమలా హారిస్ గెలిస్తే తొలిసారిగా ఓ మహిళా అమెరికా అధ్యక్షురాలు అయినట్లు అవుతుంది. పైగా భారత సంతతి మహిళ అమెరికా అధ్యక్షురాలు అయినట్లు అవుతుంది.

ఇప్పటికే 4కోట్ల మంది ఓట్లు వేశారు. అక్కడ ఆన్ లైన్ ఓటింగ్ ఉండటంతో వారం నుంచి ఓట్లు వేస్తున్నారు. అయినప్పటికీ రేపు జరిగే ఎన్నికలు అసలైనా మజా ఇస్తాయి. అయితే భారతీయులవైపు నుంచి చూస్తే ఎక్కువ మంది కమలా హారీస్ గెలవలాని కోరుకుంటున్నారు.

కానీ ఇక్కడో కీలక పాయింట్..కమలా హారిస్ భారత సంతతి మహిళ. కానీ అమెకు భారత్ పట్ల ప్రత్యేక అభిమానం ఉండే అవకాశాలు మాత్రం తక్కువే. గత నాలుగేళ్లలో ఆమె ఒక్కసారి కూడా భారత్ కు రాలేదు. ప్రధాని మోదీ వంటి వారు అమెరికా వెళ్తే మాత్రం ఆతిథ్యం ఇచ్చారు. అయితే ఉపాధ్యక్షురాలు కాబట్టి ఆతిథ్యం ఇవ్వడం సహజమే. అంతేకానీ భారత్ పట్ల ఆమె ఏనాడు ఆసక్తిని చూపలేదు.

ఇక ట్రంప్ అండ్ కోలో కూడా భారత సంతతి మూలాలు ఉన్నవాళ్లు ఉన్నారు. అందుకే అమెరికాలో భారతీయులంతా కమలా హారిస్ కే ఓటు వేసే పరిస్థితి లేదని చెప్పవచ్చు. ఈ ఇద్దరిలో ఎవరు అధ్యక్షులైనా వారి మొదటి ప్రయార్టీ అమెరికాయే అవుతుంది. గత పాలకులు కూడా అదే చేశారు.

అయితే ట్రంప్ వస్తే వీసా రూల్స్ కఠినతరం చేస్తారు. భారత్ నుంచి అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు చేయాలనుకునేవారు, స్థిరపడాలనుకునేవారికి ట్రంప్ వస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కమలా అధ్యక్షురాలైతే భారత్ కు పూర్తిగా సానుకూలంగా ఉంటారని కూడా అనుకోలేము. ఏ నిర్ణయమైనా అమెరికాకు అనుకూలంగానే తీసుకుంటారు.

ప్రస్తుతానికి వీరిద్దరికీ రేసులో పెద్దగా తేడా లేదు. ఇద్దరూ గట్టిపోటీయే ఇస్తున్నారు. ట్రంప్ దూకుడుతనం ఆయన మరింత అనుకూలంగా మారుతుంది. కమలా మహిళ కావడం..గత నాలుగేళ్లలో ఆమె ఉపాధ్యక్షురాలిగా బాగా పనిచేయడం వంటి అంశాలు కూడా ఆమెకు ప్లస్ అవుతున్నాయి. స్వింట్ స్టేట్స్ లో ఓటర్లు ఏవైపు మొగ్గు చూపుతారో దాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News