గాల్వన్ ఘర్షణలో 60 మందికి పైగా చైనా సైనికులు మృతి
అమెరికన్ వార్తాపత్రిక న్యూస్ వీక్ (సెప్టెంబర్ 11) తన వ్యాసంలో గాల్వన్ గురించి షాకింగ్ విషయాలు రాసింది. ఈ కథనం ప్రకారం, జూన్ 15 న..
అమెరికన్ వార్తాపత్రిక న్యూస్ వీక్ (సెప్టెంబర్ 11) తన వ్యాసంలో గాల్వన్ గురించి షాకింగ్ విషయాలు రాసింది. ఈ కథనం ప్రకారం, జూన్ 15 న గాల్వన్లో జరిగిన ఘర్షణలో 60 మందికి పైగా చైనా సైనికులు మరణించారని పేర్కొంది. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ భారత భూభాగంలో దూకుడు చర్యకు కాలుదువ్వినా.. అతని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) అపజయం పాలైందని పేర్కొంది. పిఎల్‌ఎ ఇంత ఘోరంగా అపజయం పాలవుతుందని జిన్‌పింగ్ ఊహించలేదట.
భారత సరిహద్దులో చైనా సైన్యం విఫలం అవ్వడం కూడా ఆయనకు కలిసొచ్చిందని.. ఈ వైఫల్యం తరువాత సైన్యంలోని తన ప్రత్యర్థులను కీలక పదవుల నుంచి తొలగించి.. విధేయులను నియమించుకోవడానికి జిన్‌పింగ్ ప్రయత్నాలు చేశారని రాసింది. దీని వలన ఆర్మీలో జిన్‌పింగ్ కు ఎదురుచెప్పే పెద్ద అధికారులు ఉండరని జిన్‌పింగ్ ఆలోచించారని పేర్కొంది. వాస్తవానికి, మే ప్రారంభంలో, చైనా దళాలు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఐసి) కి దక్షిణంగా ముందుకు సాగాయి.
లడఖ్‌లో, భారతదేశం మరియు చైనా మధ్య మూడు వేర్వేరు ప్రాంతాల్లో తాత్కాలిక సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు ఇప్పటికి పరిష్కరించబడలేదు.. దీని అవకాశంగా మలుచుకొని పిఎల్‌ఎ భారత సరిహద్దులోకి ప్రవేశిస్తూనే ఉంది. ముఖ్యంగా జి జిన్‌పింగ్ 2012 లో పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన తరువాత ఈ చొరబాట్లు మరింత పెరిగాయని న్యూస్ వీక్ పేర్కొంది. గాల్వన్‌లో జరిగిన భారత్-చైనా ఘర్షణ 40 సంవత్సరాల తరువాత ఇరు దేశాలలో జరిగిన మొదటి ప్రమాదకరమైన ఘర్షణగా భారత్ ఆర్మీ అభివర్ణించింది. ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరవీరులయ్యారు.