భారత్ మా దోస్త్ అంటున్న అమెరికా
* చైనాను నమ్మలేమంటున్న బైడెన్ బృందం * అమెరికా విదేశీ వ్యవహారాల వ్యూహాన్ని సెనేట్ కమిటీకి వివరించిన బైడెన్ బృందం * డ్రాగన్ అత్యంత ప్రమాదకారి-ఆంటోని బ్లింకన్
చైనా విసురుతున్న అన్ని రకాల సవాళ్లను దీటుగా ఎదుర్కొని, డ్రాగన్ దూకుడుకు కళ్లెం వేయడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని అమెరికా నూతన అధ్యక్షుడైన బైడెన్ పాలన బృందం స్పష్టం చేసింది. భారత్-అమెరికా మధ్య కొనసాగుతున్న బలమైన ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపింది. తమ నియామకాలకు ఆమోదం పొందే క్రమంలో బృంద సభ్యులు.. సెనేట్‌కు చెందిన విదేశీ వ్యవహారాల కమిటీ ఎదుట హాజరై తమ ముందున్న కర్తవ్యాలను వివరించారు.
రక్షణ వ్యవహారాల్లో భారత్‌తో అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు లాయిడ్ ఆస్టిన్. భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాద ముఠాల అణచివేతలో పాకిస్థాన్ చర్యలు అసంపూర్ణంగానే ఉన్నాయన్నారు ఆయన. ప్రపంచాధిపత్యం కోసం చైనా అర్రులు చాస్తోందని.. తైవాన్‌ను చైనా ఆక్రమించుకోకుండా కట్టడిచేసేందుకు అమెరికా ప్రయత్నాలు కొనసాగాలన్నారు.
అమెరికా భద్రతకు అతిపెద్ద సవాలు చైనా నుంచే ఎదురవుతోందన్నారు ఆంటోని బ్లింకెన్. హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యాన్ని పాతరవేస్తున్న చైనా పట్ల మెతక ధోరణి ఏమాత్రం తగదన్నారు ఆయన. కరోనా వైరస్ విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించలేమన్నారు. ఇక భారత్‌తో బృందం బిల్ క్లింటన్ హయాం ముగిసే నాటికే బలపడిందన్నారు ఆంటోని బ్లింకెన్. ఇక భారత్‌తో కలిసి ముందుకెళ్తే ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సహా ఏదేశం అమెరికాకు సవాళ్లను విసరలేదంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.
AMERICA VS CHINA 04 : చైనా నుంచి అమెరికా భద్రతకు ముప్పు పొంచి ఉన్నట్లు చెప్పారు అవ్రిల్ హెనెస్. వివిధ రంగాల నుంచి డ్రాగన్ విసురుతున్న సవాళ్లపై నిఘా వర్గాలను ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు ఆయన. అమెరికా అద్భుత ప్రగతి సాధించిన రంగాల నుంచి రహస్యాలను తరలించే గుఢచర్యాన్ని అడ్డుకుని తీరాలన్నారు.