America Presidential Elections: భారతీయులకు డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి బిడెన్ తీపి కబురు..

America Presidential Elections: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి, మాజీ వైస్ ప్రెసిడెంట్, జో బిడెన్(77) భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త అందించారు.

Update: 2020-07-02 13:00 GMT
Joe Biden (File Photo)

America Presidential Elections: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి, మాజీ వైస్ ప్రెసిడెంట్, జో బిడెన్(77) భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త అందించారు. అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్(77) భారతీయ ఐటీ నిపుణులకు తీపి కబురు అందించారు. ట్రంప్ సర్కార్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే హెచ్1బీ వీసాలపై విధించిన తాత్కాలిక సస్పెన్షన్‌ను ఎత్తివేస్తానని ప్రకటించారు. అధ్యక్ష పదవిలో మొదటి వంద రోజుల పరిపాలనలో చేపట్టబోయే కీలక చర్యలపై ప్రశ్నించినపుడు ప్రకటన చేయడం ఆరోపించారు.

ఈ నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే, మొదటి రోజే ఈ దేశానికి ఎంతో సహకారం అందించే 11 మిలియన్ల మంది వలసదారుల పౌరసత్వానికి సంబంధించి కాంగ్రెస్‌కు ఇమ్మిగ్రేషన్ సంస్కరణల రోడ్‌మ్యాప్ బిల్లును పంపబోతున్నానన్నారు. ఆసియా అమెరికన్, పసిఫిక్ ద్వీపవాసుల సమస్యలపై డిజిటల్ టౌన్ హాల్ సమావేశంలో బిడెన్ ఈ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా... ఈ దేశాన్ని నిర్మించారంటూ హెచ్1 బీ వీసాదారుల సేవలను ఆయన ప్రశంసించారు. తమ ఇమ్మిగ్రేషన్ విధానం వైవిధ్యంగా ఉండబోతోందని వివరించారు. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలు అమానవీయమైనవనీ, క్రూరమైనవని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఇమ్మిగ్రేషన్ సంస్కరణల రోడ్‌మ్యాప్ బిల్లును పంపబోతున్నానన్నారు. తమ ఇమ్మిగ్రేషన్ విధానం వైవిధ్యంగా ఉండబోతోందని వివరించారు. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలు అమానవీయమైనవనీ, క్రూరమైనవని ఆయన ఆరోపించారు.


Tags:    

Similar News