కాబుల్ ఎయిర్ పోర్టులో మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని జో బైడెన్ హెచ్చరిక

Joe Biden - Kabul Airport: * రాగల 24 గంటల్లో విమానాశ్రయ పరిసరాల్లో దాడులు జరిగే ఛాన్స్ * పౌరులందరూ వెనక్కు వెళ్లాలని సూచన

Update: 2021-08-29 04:57 GMT

కాబుల్ ఎయిర్ పోర్టులో మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని జో బైడెన్ హెచ్చరిక 

Joe Biden - Kabul Airport: కాబూల్ ఎయిర్ పోర్టులో వచ్చే 24 గంటల్లో మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. రాగల 24 గంటల నుంచి 36 గంటల్లో విమానాశ్రయ పరిసరాల్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. దాంతో కాబుల్ ఎయిర్ పోర్టులో పౌరులు తక్షణమే ఖాళీ చేయాలని సూచించారు. మరోవైపు.. ఉగ్రవాదుల స్థావరాలపై డ్రోన్ దాడులు జరగడం ఇదే చివరిది కాదని స్పష్టం చేశారు.. ఐసిస్ ఉగ్రవాదులకు బైడెన్ హెచ్చరికలు జారీ చేశారు. తమ పౌరుల ప్రాణాలను బలిగొన్న ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే.. ఇప్పటికే జరిపిన దాడుల్లో ఆత్మాహుతి దాడికి సూత్రధారి సహా మరో ఉగ్రవాది హతమైనట్లు అమెరికా తెలిపింది.

ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లోనూ కాబూల్ నుంచి పౌరుల తరలింపు కొనసాగుతున్నదని బైడెన్ వెల్లడించారు.. ఆప్ఘన్లు తక్షణం ఎయిర్ పోర్టు వదలి వెళ్లిపోవడం మంచిదని సూచించింది. అయినా దేశం దాటేందుకు విఫలయత్నం చేస్తున్న ఆప్ఘన్లు ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లోనే ఉంటున్నారు.. ఎండుకు ఎండుతూ.. తమ చిన్నారులను ఎత్తుకుని నరకయాతన పడుతున్నారు.. మహిళలు,చిన్నారుల దుస్థితిని చూసి చలించిన అమెరికా సైన్యం పసివారికి నీరు తాగిస్తూ, వారిని సముదాయిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఎయిర్ పోర్టు బయట ఆప్ఘన్ పౌరుల చుట్టూ రక్షణగా నిలబడి వారికి ధైర్యాన్ని కల్పిస్తున్నారు.మరోవైపు తాలిబన్లు నిర్దాక్షిణ్యంగా దాడులు చేస్తున్నారు. దేశం దాటి వెళ్లే వారిపై ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు.

Tags:    

Similar News