America Engaged with Making Nuclear bombs: అమెరికాలో మరోసారి కొత్త అణు బాంబుల తయారీ..
America Engaged with Making Nuclear bombs: రష్యా , చైనా నుండి పెరుగుతున్న ముప్పు దృష్ట్యా, అమెరికా మరోసారి కొత్త అణు బాంబులను తయారు చేయడం ప్రారంభించింది.
America Engaged Making Nuclear bombs: రష్యా , చైనా నుండి పెరుగుతున్న ముప్పు దృష్ట్యా, అమెరికా మరోసారి కొత్త అణు బాంబులను తయారు చేయడం ప్రారంభించింది. రాబోయే పదేళ్లలో దాని పారిశ్రామిక ఉత్పత్తికి సుమారు 70 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు అధికారులు. దక్షిణ కెరొలినలోని సవన్నా నది ఒడ్డున ఉన్న కర్మాగారంలో.. అలాగే న్యూ మెక్సికోలోని లాస్ అల్మోస్‌లో ఈ ఉత్పత్తి జరుగుతుంది.
అమెరికా , రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధంలో సవన్నా నది కర్మాగారంలో అమెరికా అణ్వాయుధాల కోసం ట్రిటియం, ప్లూటోనియం ఉత్పత్తి చేసింది. 2 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కర్మాగారంలో వేలాది మంది పనిచేశారు. ఇప్పుడు 37 మిలియన్ గ్యాలన్ల రేడియోధార్మిక ద్రవ వ్యర్థాలను ఇక్కడ సేకరించారు. 30 సంవత్సరాల తరువాత, ఇక్కడ మళ్లీ అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు.
అమెరికా ఇంధన శాఖలో భాగమైన నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఎన్‌ఎస్‌ఏ) అనే అమెరికన్ సంస్థ ఇక్కడ అణ్వాయుధాలను తయారు చేస్తుంది. ప్రస్తుత అణ్వాయుధాలు చాలా పాతవని, వాటిని మార్చాల్సిన అవసరం ఉందని సంస్థ అభిప్రాయపడింది. వాస్తవానికి, ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభమైతే ప్రజలు రేడియేషన్ ఊబిలో పడతామేమో అని ఇక్కడి ప్రజలు భయపడుతున్నారు. ఒబామా ప్రభుత్వ హయాంలో ఇక్కడ అణ్వాయుధాలను తయారు చేయడానికి అంగీకరించారు.
ఈ ప్రణాళికను 2018 లో అధ్యక్షుడు ట్రంప్ ఆమోదించారు. ఇక్కడ, ప్రపంచ భద్రతా వ్యవహారాల నిపుణుడు స్టీఫెన్ యంగ్ మాట్లాడుతూ ఈ పథకం ఖరీదైనది మాత్రమే కాదు, ప్రమాదకరమైనది కూడా. అదే సమయంలో, ఫ్యాక్టరీ సమీపంలో నివసిస్తున్న 70 ఏళ్ల పిట్ లాబార్జ్, కొత్త టెక్నాలజీ సురక్షితంగా ఉంటుందని ఇంతవరకు ఎటువంటి దురదృష్టకర సంఘటనలు ఏవీ జరగలేదని చెప్పారు.