సర్జన్ నుంచి ఆల్‌ఖైదా చీఫ్‌గా అల్ జవహరీ.. అతడి తలపై ఏకంగా రూ.196 కోట్ల రివార్డ్
Al Qaeda Chief: అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరీని అమెరికా బలగాలు మట్టుపెట్టాయి.
Al Qaeda Chief: అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరీని అమెరికా బలగాలు మట్టుపెట్టాయి. ఇక ఈజిప్టు భారతీయుడైన అల్ జవహరీ ఆ దేశ సైన్యంలో సర్జన్‌గా పనిచేశాడు. తరువాతి కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో లాడెక్‌కు సన్నిహితుడిగా మారి లాడెన్ మరణం తర్వాత ఆల్‌ఖైదా చీఫ్‌గా కొనసాగాడు. ఈజిప్టు భారతీయుడైన ఐమన్ అల్ జవహరీ 19 జూన్ 1951 న ఆప్రికన్ దేశంలోని గిజాలో జన్మించాడు. బిన్ లాడెన్ లాగానే జవహరీ కూడా బిజినెస్ అండ్ ఎకనామిక్స్ అడ్మినిస్ట్రేషన్‌ను అభ్యసించాడు. పలు నివేదికల ప్రకారం సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ కూడా పొందాడు. అతని కుమారుడు కూడా ఉన్నత విద్యావంతుడే.
71ఏళ్ల జవహరీ ఈజిప్టు సైన్యంలో సర్జన్‌గా మూడేళ్లపాటు పనిచేశాడు. ఈజిప్ట్ అధ్యక్షుడు హత్య సమయంలో మిలిటెంట్ ఇస్లాంలో ప్రమేయం ఉందన్న కారణంగా 1980లో ఈ ఈజిప్ట్ వైద్యుడిని అరెస్ట్ చేశారు. మూడేళ్లుపాటు జవహరీ జైలు జీవితం గడిపాడు. విడుదలైన తరువాత ఆ దేశాన్ని విడిచిపెట్టి అంతర్జాతీయ జిహాదిస్ట్ ఉద్యమాల్లో కీలక భూమిక పోషించాడు.
1998లో అల్‌ఖైదా చీఫ్ అయ్‌మాన్ అల్-జవహరీ చేసిన వ్యాఖ్యలు న్యూయార్క్ 9-11 దాడుల నుంచి లండన్, బాగ్దాద్ వరకు అనేక ఉగ్రదాడులకు పురిగొల్పాయి. ఎంతోమంది అమాయకుల ప్రాణాలు కోల్పోయిన దాడులకు అల్ జవహరీ బాధ్యుడిగా ఉన్నాడు. అల్ ఖైదా నాయకత్వంలో బిన్ లాడెన్ తర్వాత రెండవ అత్యున్నత స్థానంలో అల్ జవహరీ కొనసాగాడు. 9-11 దాడులకు కుట్రలో లాడెన్‌తో పాటు భాగస్వామిగా ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ హింసకు ఉగ్రవాదులను పురిగొల్పాడు. దీంతో అతడి తలపై మొత్తం 25 మిలియన్ డాలర్లు మన కరెన్సీ ప్రకారం సుమారు 196 కోట్ల రివార్డ్ ఉంది. చివరకు ఆఫ్గనిస్తాన్‌లో అమెరికా సైన్యం జరిపిన ఆపరేషన్‌లో జవహరీ హతమయ్యాడు.