Coronavirus: చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Coronavirus: లాంఝౌలో లాక్‌డౌన్.. కొత్తగా 6 కేసులు నమోదు

Update: 2021-10-26 09:59 GMT
Representational Image

Coronavirus: కరోనా వ్యాప్తికి కారణమైన చైనాను మహమ్మారి మరోసారి వణికిస్తోంది. కరోనా కేసులు పెరుగుతుండడం డ్రాగన్‌ వాసులను ఆందోళన కలిగిస్తోంది. చైనాలోని అనేక ప్రాంతాల్లో డెల్టా వేరియంట్‌కు చెందిన కరోనా వైరస్ వ్యాప్తి నిరంతరం పెరుగుతోంది. 40 లక్షల మంది జనాభా ఉన్న లాంజౌ సిటీలో లాక్‌డౌన్ విధించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చైనాలో కొత్తగా 29 కేసులు నమోదుకాగా లాంజౌలో 6 కేసులు వచ్చినట్టు అధికారులు గుర్తించారు.

ముందు జాగ్రత్త చర్యగా ఘన్షు ప్రావిన్స్ రాజధాని అయిన లాంజౌలో లాక్‌డౌన్ విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ అమలు కఠినంగా ఉంటుందని, కేవలం నిత్యవసరాలు, వైద్య చికిత్సలకు మాత్రమే బయటకు అనుమతిస్తామని తేల్చి చెప్పారు. ఎవరికి వారు ఇళ్లకే పరిమితం కావాలని స్పష్టం చేశారు. కేసులు పెరుగుతుండడంతో ఇప్పటికే ఆ దేశంలో టూరిస్టులపై ఆంక్షలు విధించారు. వారంలోనే చైనాలో వందకుపైగా కేసులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. 

Tags:    

Similar News