చేతులెత్తేసిన సైన్యం.. క్షణ క్షణానికి దిగజారుతున్న అప్ఘాన్ పరిస్థితులు
* భారత్ కు పెరుగుతున్న శరణార్ధుల తాకిడి * భారత్ కు సాయం చేసే వారిని ఆదుకునే ఉద్దేశంలో కేంద్రం
Afghanistan: ఆప్ఘానిస్థాన్ లో పరిస్థితి క్షణ క్షణానికి దిగజారుతోంది. తాలిబాన్లు ప్రావిన్షియల్ రాజధానులను హస్తగతం చేసుకుంటూ ముందుకు కదులుతుంటే సైన్యం, ప్రభుత్వాధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. అప్ఘానిస్థాన్ పరిస్థితిపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ దేశంలో ఉండేందుకు భయపడుతున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి పోతున్నారు. ఆప్ఘానిస్థాన్ పొరుగు దేశమైన భారత్ పైనా శరణార్ధుల ఒత్తిడి పెరుగుతోంది. భారత రాయబార కార్యాలయానికి శరణార్ధుల వినతుల వెల్లువ పెరుగుతోంది.సాధ్యమైనంత మందికి ఆశ్రయం కల్పించేందుకు భారత్ కూడా ప్రయత్నిస్తోంది. మరోవైపు జాతినుద్దేశించి ప్రసంగించిన అధ్యక్షుడు ఘనీ అస్థిరత రాకుండా చర్చలతో పరిస్థితిని అదుపు చేస్తామని చెబుతున్నారు.