Afghanistan: తాలిబన్లకు ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆఫర్

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకం కొనసాగుతున్న వేళ ఘాని సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Update: 2021-08-12 14:29 GMT

Afghanistan: తాలిబన్లకు ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆఫర్

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకం కొనసాగుతున్న వేళ ఘాని సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. హింస‌ను ఆపితే ప్రభుత్వంలో మీకూ వాటా ఇస్తామ‌ని ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రకటించింది. తాలిబ‌న్ తిరుగుబాటుదారులు రాజ‌ధాని కాబూల్ ద‌గ్గరికి దూసుకు వ‌స్తుండ‌టంతో ప్రభుత్వం ఇలా స్నేహ హ‌స్తాన్ని చాచింది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా ద‌ళాలు వెళ్లిపోతుండ‌టంతో అక్కడ మ‌రోసారి తాలిబ‌న్లు రాజ్యమేల‌డానికి సిద్ధమ‌వుతున్నారు.

మరోవైపు ప్రధాన నగరాలను ఆక్రమిస్తూ వస్తున్న తాలిబన్లను ఎదుర్కోవడం ఆఫ్ఘన్ సాయుధ బ‌ల‌గాల వ‌ల్ల కావ‌డం లేదు. ఇప్పటికే రాజ‌ధాని కాబూల్, మ‌రో ప్రధాన న‌గ‌రం కాంద‌హార్ మ‌ధ్య హైవేపై ఉన్న ఘ‌జినీ న‌గ‌రం కూడా వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. కాంద‌హార్‌లోనూ రెండు వ‌ర్గాల మ‌ధ్య భీక‌ర యుద్ధం జ‌రుగుతోంది. ఇప్పటికే అక్కడి ప్రావిన్సియ‌ల్ జైలును స్వాధీనం చేసుకున్నట్లు తాలిబ‌న్లు ప్రక‌టించారు. మరోవైపు అష్రాఫ్ ఘానీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని ఇప్పటికే తాలిబన్ అధికార ప్రతినిధి సొహెయిల్ స్పష్టం చేశారు. ఘానీ సర్కార్‌కు తాము ఎన్నటికీ లొంగేది లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్ఘన్ ఆఫర్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది.

Tags:    

Similar News