తాలిబన్లకు భారీ షాక్.. మూడు జిల్లాలను స్వాధీనం చేసుకున్న ఆఫ్గాన్ సైన్యం
Afghanistan: అఫ్గనిస్థాన్ లో తమకు ఇక తిరుగులేదని భావిస్తున్న తాలిబన్లకు భారీ షాక్ తగలింది. వారిపై ప్రతిఘటన మొదలైంది. ఇప్పటికే ఉత్తర అఫ్గనిస్థాన్‌లోని మూడు జిల్లాలను తాలిబన్ల నుంచి ఆఫ్గాన్ సైన్యం స్వాధీనం చేసుకుంది. పంజిషిర్ లోయకు సమీపంలోని మూడు జిల్లాలను ఆఫ్గన్ ప్రభుత్వ సైన్యం, ఇతర మిలీషియా గ్రూప్‌లు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నాయి. ఈ వివరాలను ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ బిస్మిల్లాహ్ మహ్మద్ ట్విట్టర్‌లో తెలిపారు. పంజిషీర్‌కు ఉత్తరాన బఘలాన్ ప్రావిన్సుల్లోని దేహ్ సలేహ్, బనో, పల్-హేసర్ జిల్లాలలో తాలిబన్‌లను ప్రతిఘటించి అక్కడ నుంచి వెళ్లగొట్టినట్లు బిస్మిల్లాహ్ మహ్మద్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.