Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌కు 120 మంది భారత క్రీడాకారులు.. జులై 26 నుంచి పోటీలు షురూ..

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌కు 120 మంది భారత క్రీడాకారులు.. జులై 26 నుంచి పోటీలు షురూ..

Update: 2024-07-13 09:03 GMT

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌కు 120 మంది భారత క్రీడాకారులు.. జులై 26 నుంచి పోటీలు షురూ..

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ప్రారంభమై ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. ఇందులో 120 మంది భారత క్రీడాకారులు పాల్గొంటున్నారు. పారిస్ 2024 ఒలింపిక్స్ కోసం అదానీ గ్రూప్ భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా మారింది. ఈ విషయాన్ని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ స్వయంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. సోమవారం ఆయన పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారుల మనోధైర్యాన్ని పెంచేందుకు రూపొందించిన డాక్యుమెంటరీని ఆవిష్కరించారు.

2024 పారిస్ ఒలింపిక్స్‌కు మేం సన్నద్ధమవుతున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా వేదికపై మన దేశానికి ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రీడాకారుల అవిశ్రాంత కృషి, అచంచలమైన అంకితభావం దేశ ఎనలేని స్ఫూర్తికి ప్రతీక. ఇప్పటి వరకు జరిగిన ఒలింపిక్స్‌లో కంటే ఈసారి అత్యధిక పతకాలు సాధిస్తామన్న నమ్మకం ఉందని అన్నారు.

జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఒలింపిక్స్ జరగనున్నాయి. ఇందులో 120 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ స్టార్ శరత్ కమల్ పారిస్ ఒలింపిక్స్ 2024కి ప్లాగ్ బేరర్లుగా ఎంపికయ్యారు. అలాగే, 2012 కాంస్య పతక విజేత షూటర్ గగన్ నారంగ్ పారిస్‌లో జరగబోయే ఈవెంట్ కోసం మేరీ కోమ్ స్థానంలో చెఫ్-డి-మిషన్‌గా ఎంపికయ్యాడు. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా నేతృత్వంలో 28 మంది క్రీడాకారులు అథ్లెటిక్స్‌లో పాల్గొననున్నారు.

భారతదేశం 2036లో ఒలింపిక్స్‌..

2036లో జరిగే ఒలింపిక్ క్రీడలకు భారతదేశం బిడ్ దాఖలు చేసే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గుజరాత్ ఒలింపిక్ సంఘం, గుజరాత్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నాయి. అక్కడ వివిధ క్రీడలకు సంబంధించిన క్రీడా సముదాయాలను నిర్మిస్తున్నారు. 2036లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తానని దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా చాలాసార్లు చెప్పిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News