Eating Home Walls: అమెరికాలో వింత మహిళ.. ఐదేళ్లుగా గోడను తింటుంది..
* అమెరికాలోని మిచిగాన్ నివాసి నికోల్ ఐదేళ్లుగా వింతగా ప్రవర్తిస్తుంది. * మంచి రంగు రంగులో గోడ కనిపిస్తే చాలు ఇక అంతే.
America Women - Eating Home Walls: ఎవరైనా ఆకలైతే ఏం తింటారు అన్నం లేదా చపాతి తింటారు. లేదంటే పండ్లు కానీ ఏదైనా ఆహార పదార్థాలు కానీ తింటారు. కానీ అమెరికాలో ఒక మహిళ ఏం చేసిందో తెలుసా, ఇంట్లో ఉన్న గోడని తింది. అవును మీరు విన్నది నిజమే. అమె ఈ ఒక్కరోజే గోడని తినలేదు. గత ఐదేళ్లుగా అదే పనిలో ఉంది. మంచి రంగు రంగులో గోడ కనిపిస్తే చాలు ఇక అంతే. టేస్ట్ చేయంది వదలదు. అంతలా అలవాటు అయింది. అయితే ఆ మహిళ సంగతి ఒక్కసారి తెలుసుకుందాం.
అమెరికాలోని మిచిగాన్ నివాసి నికోల్ ఐదేళ్లుగా వింతగా ప్రవర్తిస్తుంది. ఇటీవల ఆమె ఒక టీవీ ప్రోగ్రామ్ ద్వారా తన వింత అలవాటు గురించి చెప్పింది. ఐదేళ్లుగా ఇంట్లోని గోడలని తింటున్నాని అందరి ముందు చెప్పింది. దీంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పొడి గోడ సువాసన అంటే తనకు బాగా ఇష్టమని చెప్పింది.
అంతేకాదు తాను ఒక వారంలో మూడు చదరపు అడుగుల గోడని తింటానని తెలిపింది. ఆమె ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా ఈ అలవాటుని మానుకోలేదు. నికోల్ తన ఇంట్లోనే కాకుండా ఇతరుల ఇళ్ల గోడలను కూడా తింటుందని అతని బంధువులు చెబుతున్నారు. ఆమె తల్లి మరణించడంతో డిప్రెషన్‌కి గురై గోడలు తినడం మొదలుపెట్టింది.
ఈ వ్యసనం వల్ల తాను చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని నికోల్ బాధపడుతుంది. కానీ ఇవి తిన్నప్పుడు ఒక తెలియని అనుభూతి కలుగుతుందని చెప్పింది. మరోవైపు వైద్యులు ఆమెను హెచ్చరించారు. గోడలకు వేసే పెయింట్ లో హానికరమైన రసాయనాలు ఉంటాయని, వాటి వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా వారి పేగులలో సమస్యలు ఏర్పడుతాయన్నారు.