Canada: ట్రూడో ప్రభుత్వం కీలక నిర్ణయం.. వలసదారులను భారీగా తగ్గించనున్న కెనడా

Canada: వచ్చే ఏడాది కెనడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రూడో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని ప్రవేశించే వలసదారుల సంఖ్యను భారీ తగ్గించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Update: 2024-10-24 04:53 GMT

 Canada: ట్రూడో ప్రభుత్వం కీలక నిర్ణయం.. వలసదారులను భారీగా తగ్గించనున్న కెనడా

Canada: వచ్చే ఏడాది కెనడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రూడో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని ప్రవేశించే వలసదారుల సంఖ్యను భారీ తగ్గించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

వలసల నియంత్రణకు కెనడా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. తమ దేశంలోని అనుమతించే వలసదారుల సంఖ్యను భారీగా తగ్గించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతోనే ట్రూడో సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఈ విషయాన్ని అక్కడి వార్తపత్రికల్లో కథనాలు వచ్చాయి.

కెనడా వార్త పత్రికల కథనాల ప్రకారం 2004లో 4,85,000 మందిని శాశ్వత నివాసితులుగా కెనడా ప్రభుత్వం గుర్తించింది. అయితే 2025లో ఈ సంఖ్యను 3,80,000లకు తగ్గించింది. 2027 నాటికి 3,65,000 మందికి మాత్రమే ప్రవేశం కల్పించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చేపట్టిన సర్వేల్లో ట్రూడో నేత్రుత్వంలోని లిబరల్ ప్రభుత్వం వెనకంజలో ఉంది. వలసల కారణంగా నిరుద్యోగం పెరిగిపోతుండటంతోపాటు దేశీయంగా ఇళ్ల కొరత కూడా విపరీతంగా ఉంది.

దీంతో అధికార ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే ఈమధ్యే విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు, వర్కర్లకు పని అనుమతులపై మరిన్ని ఆంక్షలు తీసుకురానున్నట్లు తెలిపింది. తాజాగా వలసదారుల సంఖ్యను మరింత తగ్గించేందుకు నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News