Joshimath: రెండో రోజుల్లో జోషిమఠ్‌కు రానున్న సైంటిస్టుల బృందం
Joshimath: భౌగోళిక పరిణామాల కారణాలను తేల్చేందుకు సిద్ధమైన శాస్త్రవేత్తలు
Joshimath: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్‌లో ఉన్నపళంగా మారిపోతున్న భౌగోళిక పరిణామాల కారణాలను తేల్చేందుకు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. రెండు రోజుల్లో జోషీమఠ్ చేరుకోనున్న సైంటిస్టుల బృందం వారం రోజుల్లో సమగ్ర నివేదిక అందించనుంది. కొండపై ఏటవాలుగా ఏర్పడిన జోషీమఠ్.. 1972 నుంచి అత్యంత ప్రమాదకర ప్రాంతంగానే ఉందని ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఆనంద్ కుమార్ పాండే తెలిపారు. పట్టణీకరణ, భూగర్భ జలాల పొరల్లో కలిగిన లింకేజీ.. భూమి కుంగడానికి కారణమై ఉండొచ్చని చెబుతున్నారు.
జోషీమఠ్‌లో ప్రత్యేక పరికరాలతో అధ్యయనం చేయనున్నారు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ, మల్టీ ఛానెల్ అనాలసిస్ ఆఫ్ సర్ఫెస్ వేవ్ పరికరాలతో భూగర్భ జలాలు, భూకంప తీవ్రత, భూమి అడుగున చోటుచేసుకున్న ఒత్తిళ్లను అంచనా వేయనున్నారు. జోషీమఠ్ మనుగడపై భౌగోళిక అంశాలను అధ్యయనం చేయడంలో NGRI పరిశోధనలు కీలకంగా మారనున్నాయి. శాస్త్రీయ కోణంలో జరిగే అధ్యయనంతో అసలు కారణాలు తెలనున్నాయి.