Corona Cases in America: అగ్రరాజ్యం అమెరికాపై కరోనా పంజా
Corona Cases in America: గడిచిన 24 గంటల్లో 88,376 కొత్త కేసులు * ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత భారీ స్థాయిలో నమోదైన కేసులు
Corona Cases in America: అగ్రరాజ్యం అమెరికాపై కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా మహమ్మారి మళ్లీ పడగవిప్పుతోంది. 24 గంటల వ్యవధిలో అమెరికాలో 88 వేల 376 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత అమెరికాలో ఇంతటి భారీ స్థాయిలో కేసులు నమోదవడం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. గతవారం ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో అత్యధికంగా అమెరికాలోనే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. జులై 19 నుంచి 25 మధ్య అగ్రరాజ్యంలో 5లక్షలకు పైగా కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం అక్కడ వారానికి సగటున 60వేలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి.
వ్యాక్సినేషన్ రేటు తగ్గుముఖం పట్టడం, డెల్టా వేరియంట్ విస్తృతే తాజా ఉద్ధృతికి కారణమని నిపుణులు చెబుతున్నారు. కేసులు పెరుగుతుండటంతో అమెరికాలోని పలు రాష్ట్రాలు మళ్లీ కొవిడ్ నిబంధనలు అమల్లోకి తెస్తున్నాయి. టీకా తీసుకున్న వాళ్లకి మాస్కు అవసరం లేదని ప్రకటించిన రాష్ట్రాలు.. తాజాగా మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలిస్తున్నాయి.