Kabul Airport Attack: ఆప్ఘనిస్థాన్ లో వరుస బాంబు పేలుళ్లు, 40 మంది మృతి
Kabul Airport Incident: * ఈ దాడుల్లో 40 మంది చనిపోయినట్లు నిర్ధారణ * మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్
Kabul Airport Attack: తాలిబన్ల చెరలో చిక్కిన ఆప్ఘనిస్థాన్ లో ఉన్నట్టుండి బాంబు పేలుళ్లు జరిగాయి. కాబూల్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఎంట్రెన్స్ సమీపంలో జనాల గుంపుల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సుమారు 40 మంది చనిపోయినట్లు తాలిబన్ ప్రతినిధులు చెబుతున్నారు. మృతుల్లో పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా చాలా మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. అందులో సుమారు ముగ్గురు యూఎస్ సైనికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక పేలుడు ఎయిర్‌పోర్ట్ గేట్ బయట జరగ్గా మరో పేలుడు బ్యారన్ హోటల్ వద్ద జరిగింది. ఘటనను అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ కూడా ధృవీకరించింది.