Liberia: ఘోర ప్రమాదం.. లైబీరియాలో ఇంధన ట్యాంకర్ పేలి 40 మంది మృతి

Liberia: ప్రమాదంలో మరో 83 మందికి గాయాలు

Update: 2023-12-29 05:12 GMT

Liberia: ఘోర ప్రమాదం.. లైబీరియాలో ఇంధన ట్యాంకర్ పేలి 40 మంది మృతి

Liberia: లైబీరియాలోని టొటోటాలో ఘోర ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడి పేలిన ఘటనలో 40 మంది మృతి చెందారు. ప్రమాదంలో మరో 83 మంది తీవ్రంగా గాయపడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయతే బోల్తాపడిన ట్యాంకర్ నుంచి పెట్రోల్ తీసుకునేందుకు స్థానికులు ఒక్కసారిగా అక్కడికి చేరుకుని ట్యాంకర్‌లో నుంచి పెట్రోల్ తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆ ట్యాంకర్ నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో మంటల ధాటికి అక్కడున్న వారంతా ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు.

Tags:    

Similar News