Zika Virus: కేరళలో ఒకవైపు కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతూనే ఉంది.. మరోవైపు జికా వైరస్ కూడా కేరళను ఆందోళనకు గురి చేస్తోంది. కేరళలో ఇప్పటి వరకు 19 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. అనారోగ్యంతో కేరళ రాజధాని తిరువంతనపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలికి జికా వైరస్ సోకినట్టు తేలింది. ఆమె నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించగా జికా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. జికా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. కేంద్రం కూడా అలర్ట్ అయింది. దాంతో కేంద్రం బృందాన్ని కేరళకు పంపించింది.