Syria: సిరియాలో మిలిటరీ అకాడమీపై డ్రోన్ దాడి.. 100 మందికి పైగా మృతి
Syria: ఉగ్ర సంస్థలే ఘటనకు పాల్పడినట్లు అనుమానం
Syria: సిరియాలో మిలిటరీ అకాడమీపై డ్రోన్ దాడి జరిగి 100 మందికి పైగా మృతి చెందారు. సుమారు 200 మంది గాయపడ్డారు. హోమ్స్‌లో మిలిటరీ గ్రాడ్యుయేషన్ వేడుక జరుగుతున్న సందర్భంగా ఈ దాడి చోటుచేసుకుంది. చనిపోయిన వారిలో సైనిక అధికారులు కుటుంబ సభ్యులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఉగ్ర సంస్థలే ఈ ఘటనకు పాల్పడినట్లు సిరియా మిలిటరీ ఆరోపించింది. అయితే సిరియా అంతర్యుద్ధంలో ప్రభుత్వంతో పోరాడుతున్న తిరుగుబాటుదారులుగానీ, జిహాదిస్టులు ఈ దాడిపై ప్రకటన విడుదల చేయలేదు.
మిలిటరీ కాలేజీలో శిక్షణ పూర్తికావడంతో గురువారం సైనిక అధికారులకు గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించారు. ఈ వేడుకకు క్యాడెట్స్ కుటుంబ సభ్యులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా డ్రోన్ దాడి చేసుకోవడంతో ఒక్కసారిగా భయబ్రాంతులు చోటుచేసుకున్నాయి. ఆ ప్రాంతమంతా రక్తపు గాయాలతో, హాహాకారాలతో భీతావాహ దృశ్యం కనిపించింది. బాధితుల ఆర్తనాదాలతో ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వెంటనే తేరుకున్న సైనికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.