India Election Results 2024: సార్వత్రిక ఎన్నికలు - 2024 లైవ్ అప్‌డేట్స్..
India Election Results 2024: దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఏపీ అసెంబ్లీ, తెలంగాణ లోక్‌సభ స్థానాలు సహా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
ఇక్కడి నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించారు. తన సమీప సీపీఐ అభ్యర్థి యానీ రాజాపై 3.5లక్షలపైగా మెజార్టీతో గెలుపొందారు.
అటు ఉత్తరప్రదేశ్‌లోని తమ కంచుకోట రాయ్‌బరేలీలో 3.7లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో విజయం దిశగా దూసుకెళ్తున్నారు.
జేపీ నడ్డా నివాసంలో కీలక సమావేశం
అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, నడ్డా కీలక భేటీ
మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ
సాయంత్రం 7 గంటలకు ఎన్డీయే పక్షాల భేటీ
రెండు చోట్ల భారీ ఆధిక్యంలో రాహుల్ గాంధీ..
వాయనాడ్ లో 3 లక్షలకు పైగా లీడ్, రాయబరేలిలో 2 లక్షల 33 వేల లీడ్
ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం.. ఎన్డీయే 290 స్థానాల్లో, ఇండి కూటమి 232 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
దేశవ్యాప్తంగా పుంజుకున్న కాంగ్రెస్
కేరళ, తమిళనాడులో ప్రభావం చూపని ఎన్డీఏ
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీదే హవా
యూపీలో పనిచేయని అయోధ్య మంత్రం
యూపీలో ఇండియా కూటమికి పెరిగిన గ్రాఫ్
మహారాష్ట్రలోనూ ఇండియా కూటమి లీడ్
రాజస్థాన్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ
పంజాబ్‌లో అధిక స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం
మధ్యప్రదేశ్‌లోని అన్ని స్థానాల్లో బీజేపీ లీడ్
ఒడిశాలో నవీన్ పట్నాయక్ జోరుకు బీజేపీ బ్రేక్
కర్నాటకలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ఆధిక్యం
అసోంలో 10 స్థానాల్లో బీజేపీ ముందంజ
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కేంద్రమంత్రి అమిత్ షా తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్‌భాయ్‌పై 3.7లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు.
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కేంద్రమంత్రి అమిత్ షా హవా
తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్‌భాయ్‌పై 3లక్షలకు పైగా ఆధిక్యంలో దూసుకెళ్తున్న అమిత్ షా
గుజరాత్- బీజేపీ 25, కాంగ్రెస్ 1
హర్యానా- కాంగ్రెస్ 5, బీజేపీ 4, ఆప్ 1
హిమాచల్ ప్రదేశ్- బీజేపీ 4
జమ్మూ కాశ్మీర్- NC 2, బీజేపీ 2
తెలంగాణ – కాంగ్రెస్ 8, బీజేపీ 7, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 1
ఆంధ్రప్రదేశ్- టీడీపీ 15, వైఎస్సార్సీపీ 3, బీజేపీ 3
ఢిల్లీ- బీజేపీ 6, కాంగ్రెస్ 1..
బీహార్- జేడీయూ 12, బీజేపీ 9, ఎల్జేపీ 5, ఆర్జేడీ 3, కాంగ్రెస్ 2
ఛత్తీస్‌గఢ్- బీజేపీ 9, కాంగ్రెస్ 2 గోవా- బీజేపీ, కాంగ్రెస్ 1
కాంగ్రెస్ 98 స్థానాల్లో ముందంజలో ఉంది
బీజేపీ 226 స్థానాల్లో ముందంజలో ఉంది
ఎస్పీ 34 స్థానాల్లో ముందంజలో ఉంది
టీఎంసీ 24 స్థానాల్లో ముందంజలో ఉంది
డీఎంకే 19 స్థానాల్లో ముందంజలో ఉంది
టీడీపీ 15 స్థానాల్లో ముందంజలో ఉంది
జేడీయూ 13 స్థానాల్లో ముందంజలో ఉంది
మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ కూటమి పైచేయి సాధించింది. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాల్లో.. NDA 20 స్థానాల్లో, ఇండియా కూటమి 27 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఎంఐఎం ఒకస్థానంలో ఉంది.