75 అండర్ 75 ఈవెంట్‌లో దేశంలోని 75 మంది వైద్యులను ఘనంగా సత్కరించిన హెచ్‌ఎంటీవీ అండ్ ది హన్స్ ఇండియా
75 అండర్ 75 ఈవెంట్‌లో దేశంలోని 75 మంది వైద్యులను ఘనంగా సత్కరించిన హెచ్‌ఎంటీవీ అండ్ ది హన్స్ ఇండియా
స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకొని విశేష సేవలు అందించిన 75 మంది ప్రముఖ వైద్యులను hmtv సత్కరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీశ్ రావు వైద్యులను సన్మానించారు. విశేష సేవలు అందించిన డాక్టర్ల సేవలను కొనియాడారు. hmtv ప్రారంభించిన నాటి నుంచి అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని మంత్రి అభినందించారు.
స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకొని వైద్యరంగంలో విశేష సేవలు అందించిన 75 మంది డాక్టర్లను hmtv సత్కరించింది. పేద ప్రజలకు వైద్యులు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వైద్యుల సేవలను ప్రశంసించారు. వైద్యరంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రశంసించారు. అప్పట్లో వైద్యవిద్యను అభ్యసించడం కష్టమయ్యేదని కొద్ది కాలేజీలు మాత్రమే అందుబాటులో ఉండేవిని మంత్రి గుర్తుచేశారు. ఈ ఏడేళ్లలో వైద్య కాలేజీల సంఖ్యను గణనీయంగా పెంచామన్న మంత్రి రాబోయే రోజుల్లో 33 జిల్లాల్లో 33 వైద్య కళాశాలల ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. కొవిడ్ తర్వాత వైద్యరంగంపై అందరూ దృష్టిపెట్టారని తెలంగాణలో 20వేల బెడ్స్ అందుబాటులోకి తెచ్చామని మంత్రి హరీష్‌రావు వివరించారు. వైద్యులకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. వైద్యుల సేవలు గుర్తించి సన్మానించిన hmtv ప్రయత్నాన్ని మంత్రి అభినందించారు.
వైద్యులు పేదలకు మరింత సేవలందించాలని కోరుకుంటున్నామని హరీష్‌రావు తెలిపారు. సిజేరియన్లు తగ్గించాలని మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. పొరుగు రాష్ట్రాల్లో సిజేరియన్లు తక్కువగా ఉన్నాయన్నారు. నార్మల్ డెలివరీ చేసిన వైద్యులకు 3వేల రూపాయల ప్రోత్సాహకంగా ఇస్తున్నామని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులు సేవాతత్వం పెంచుకోవాలని ప్రైవేట్‌కు సమానంగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. త్వరలో కేసీఆర్ న్యూట్రీషియన్ స్కీమ్, డాక్టర్లు, జర్నలిస్టులకు కొత్త ఇన్స్యూరెన్స్ స్కీమ్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తు్న్నామని హరీశ్ రావు తెలిపారు.
వైద్యరంగంలో నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ 3వ స్థానంలో ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎక్కడ చూసినా కేరళ నర్సులే కనిపిస్తారని నర్సుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో వచ్చే రెండేళ్లలో 33 నర్సింగ్ కళాశాలల ఏర్పాటుతోపాటు స్పెషలైజేషన్ కోర్సులు తీసుకువస్తామన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏడు సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు పెంచామని మంత్రి హరీశ్ రావు వివరించారు. హైదరాబాద్ లో 4 సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. మెరుగైన వైద్యవిద్యపైనా ప్రభుత్వం దృష్టిపెట్టిందన్నారు.
ఈ కార్యక్రమానికి ఎంపీ శ్రీ జి.రంజిత్ రెడ్డి గౌరవ అతిథిగా హాజరయ్యారు. "మహమ్మారి సమయంలో అందించిన ఆదర్శప్రాయమైన సేవలకు దేశవ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి అర్హులైన వైద్యులను ప్రోత్సహించడానికి ఇది మా చిన్న సహకారం" అని hmtv CEO లక్ష్మీ రావు తెలిపారు. "hmtv, ది హన్స్ ఇండియా వివిధ మార్గాల్లో ప్రజలకు సహాయం చేసే దేశంలోని అసామాన్య వీరులను గౌరవించడం ద్వారా వాటి సామాజిక సేవను కొనసాగిస్తాయి." అని ఆమె స్పష్టం చేశారు.
hmtv 75 అండర్ 75 ఈవెంట్ శ్రావణి హాస్పిటల్స్ - మాదాపూర్ స్పాన్సరర్స్ గానూ, అసోసియేట్ స్పాన్సర్ గా మెట్రో కేర్ హాస్పిటల్స్, డిజిటల్ & PR పార్టనర్ - డిజిటల్ కనెక్ట్, హైదరాబాద్ వ్యవహరించాయి.
Here is the List of Doctors Awarded with hmtv 75 under 75 Title:
1. Dr Raja Rao - Superintendent, Gandhi Hospital
2. Dr B. Bhaskar Rao - MBBS, DNB - Cardiothoracic Surgery
3. Dr M. V. Rao - MBBS, MD - General Medicine, General Physician, Internal Medicine
4. Dr Gopichand Mannam - MBBS, FRCS - General Surgery
5. Padma Shri Dr Manjula Anagani - MBBS, MD - Obstetrics & Gynaecology
6. Dr K V V N Raju - MBBS, MS - General Surgery, MCh - Surgical Oncology
7. Dr.B. Nagendra - General Surgeon, Superintendent, Osmania Hospital
8. Dr R V Prabhakara Rao - MBBS, DA, PGDHHM, PGDMLS - CEO, Basavatarakam Indo-American Cancer Hospital
9. Dr Mahaboob Khan - Superintendent, Government chest hospital
10. Dr A. V. Gurava Reddy - MBBS, DNB, M.Ch - Orthopaedics, FRCS - Trauma & Orthopedic Surgery, Sunshine Hospitals
11. Dr G V Rao - Chief of Surgical Gastroenterology, AIG Hospitals
12. Dr Srinivasulu Talacheru - MBBS, MD (Gen Medicine), Sravani Hospitals
13. Dr Mohana Vamsy CH - MBBS, DNB, MCh - Surgical Oncology, FRCS - General Surgery, Diploma in Laparoscopy
14. Dr Vunnam Krishna Prasad Rao - MD (Pediatrics), Fellowship in Neonatology (Australia) Managing Director, Ankura hospital for women & children
15. Dr Sathya Sindhuja - Chakrasiddh, Holistic Healing
16. Dr Rajah V Koppala - MBBS, MD - Radio Diagnosis Interventional Radiologist
17. Dr Ashwini Annam - MBBS, MD, DGO, Senior Consultant Gynaecologist, Sravani Hospitals
18. Dr P Ranganadham - Senior Neurosurgeon
19. Dr Kishore B Reddy - MBBS, D.Ortho, MS(Ortho), FBST, FMSO, DTB (Musculo Skeletal Oncology)
20. Dr Vinodh Madireddy - MBBS, DNB (Radiation Oncology) FRCR - Director of Radiation Oncology, Medicover Hospitals
21. Dr G.J. Benjamin - Senior Oncologist, MNJ Cancer Hospital
22. Dr.A. Zakir Ali - MBBS, DNB (Nuclear Medicine)
23. Dr Sharath Chandra Reddy - MCh - Plastic Surgery, MRCS (UK), MS - General Surgery, MBBS
24. Dr Bhargavi Arun. R - MBBS, MD (Pediatrics) New Born Specialist, Metro Care Hospitals
25. Dr Veda Prakash Gowda - MBBS, MS - Orthopaedics, DNB - Orthopaedic Surgery, MRCS (UK), FRCS - Trauma & Orthopaedic Surgery
26. Dr Rakesh Reddy - MBBS MD [Internal medicine] Consultant physician
27. Dr Jayini P Rammohen - MBBS, MS - Orthopaedics, Joint Replacement Surgeon, Orthopedist
28. Dr Manoj Kumar Singh - MBBS, MD - General Medicine, DNB - General Medicine, DM - Neurology, Neurologist
29. Dr Naveen Chettupalli - MBBS, DNB - Paediatrics - Sravani Hospitals
30. Dr AGK Ghokle - MS, MCH (CMC VELLORE ), DNB, SMP (IMC) Dsc (HONS) Apollo Hospitals
31. Dr Rinki Tiwari - Founder & Clinical Director, Origin Fertility clinic & research center
32. Dr Sushma Peruri - MS FISCP Consultant General, Laparoscopic and Colorectal Surgeon, Sravani Hospitals
33. Dr Sudhir Davala - MBBS, DNB Family Medicine (MRCGP International), Leela Multispeciality Hospitals
34. Dr Rooma Sinha - MBBS, MD DNB, FICOG &MICOG, PGDMLS, MNAMS Apollo Hospitals
35. Dr Prasad Neelam - MBBS, MS,M.Ch. Surgical Gastroenterology, Sravani Hospitals
36. Dr Siva Nagini Yalavarthi - BDS, MDS - Prosthodontics Implantologist, Prosthodontist
37. Dr Naresh Kumar Gajjala - MBBS, MS, M Ch (Neurosurgery), FNES, FNR Consultant Neurosurgeon, TX Hospitals
38. Dr S Mahesh Kumar - BAMS, MD - Ayurveda Medicine, Sri Veda Sushruta Ayurveda
39. Dr Imron Subhan - Consultant & Head of Emergency Medicine, Apollo Hospitals
40. Dr Divyasree P - MBBS, MD - Dermatology, Venerology & Leprosy, Dermatologist, Trichologist, Cosmetologist
41. Dr Annapurna, Founder and Medical Director, Arshi Skin and Hair Clinics
42. Dr Nanda Kishore - BPTH - BPT, MPTH - MPT, Cardiovascular & Pulmonary Physiotherapy.
43. Dr Chinnababu Sunkavalli M.S., M.Ch (Surgical Oncology), FIAGES, PDCR
44. Dr Suma Prasad - MBBS, DGO, MD - Obstetrics & Gynaecology, Infertility Specialist, Laparoscopic Surgeon (Obs & Gyn)
45. Dr Pottabathula Vinod Kumar - MBBS, MD PEDIATRICS, FELLOWSHIP IN NEONATOLOGY (PGPN, BOSTON USA)
46. Dr Shankar - Superintendent Fever Hospital, Hyderabad
47. Dr B Lakshmi Divya "MBBS, MD - Dermatology, Venereology & Leprosy, Dermatologist, Trichologist
48. Dr Madhu Varanasi - BHMS, Osmania, Homeopathy
49. Dr C. Chandra Sekhar - Vascular & Endo Vascular surgeon, DNB, FIVS, MCH
50. Dr Naresh Dude - MBBS DNB, Consultant Pulmonologist, TX Hospitals
51. Dr Anjaneyulu Reddy - MBBS, MS Orthopedic fellowship
52. Dr Karri Swamy - MBBS, MD, Radiology
53. Dr Linga Raju - Addl Director, Ayush
54. Dr Vijaya Deepika - MD, MBBS, Dermatologist, Trichologist, Cosmetologist
55. Dr Rahul V Chetan - MBBS, MCh - Urology, Urologist
56. Dr Maalavika Appasani - MS OBGYN Consultant Aesthetic & Functional Gynaecologist
57. Dr Jalaja Senior - Gynaecologist, Additional Superintendent, King Koti Hospital
58. Dr Hari Priya - Superintendent - Vanasthalipuram, Hyderabad
59. Dr N Sudhakar Rao - CONSULTANT ENDOCRINOLOGIST
60. Dr Deepthi Devarakonda - MS Gen Surgery, Mch Plastic Surgery Consultant aesthetic and Plastic Surgeon Eternelle Aesthetics
61. Dr P.S.S. Mounika - Emergency medicine
62. Ln. Dr. Kommu Shankar Rao - MBBS, Osmania
63. Dr Mohammad Fazalunnisa - MBBS, DGO, Clinical head Hira fertility center
64. Dr Sunitha - Sr Gynaecologist, King Koti Hospital
65. Dr Venkata Subbiah Clinical Psychologist, Errgadda Mental Hospital, Hyderabad
66. Dr Ram Singh - General Surgeon, Osmania Hospital
67. Dr Ravi Kumar - HOD & Prof Dept of Paediatrics Niloufer Hospital
68. Dr Dandepu Baswanandam - BHMS, (OSM) MD Homeo Physician
69. Dr Jay Krishna - RMO Gandhi Hospital
70. Dr Venkat - DMHO, Hyderabad
71. Dr Ramesh - Professor of General Surgeon, Osmania Hospital
72. Dr Muralidar Babi - MBBS MD (CMC Vellore), Assistant professor, Cardiac Rehab Specialist, ESIC Medical College hospital Sanathnagar
73. Dr K.S.Chandra Shekar Reddy - RMO, Deputy Civil Surgeon Fever Hospital, Hyderabad
74. Dr Sowjanya - Sr. Oncologist, MNJ Cancer Hospital
75. Dr U. Saikiran - MS Ortho, Sri Gayathri Life Care Multispecialty Hospital, Nizamabad