Custard Apple: షుగర్ పేషెంట్స్ సీతాఫలాలు తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..
Custard Apple For Diabetes: సాధారణంగా సీతాఫలం రుచి తియ్యగా ఉంటుంది. ఈ కారణంగానే సీతాఫలాన్ని తీసుకోవాలంటే డయాబెటిస్‌తో బాధపడేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు.
Custard Apple For Diabetes: ఒక్కసారి డయాబెటిస్ ఉందని తెలిస్తే చాలు జీవనశైలి మొత్తం మారిపోతుంది. తీసుకునే ఆహారం మొదలు, జీవన విధానం వరకు అంతా మారిపోతుంది. ఏది తినాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఇలాంటి వాటిలో సీతాఫలం ఒకటి. సీతాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా సీతాఫలాలు కనిపిస్తుంటాయి. అయితే డయాబెటిస్ ఉన్న వారు సీతాఫలాలు తినొచ్చా అనే సందేహం ప్రతీ ఒక్కరికీ ఉంటుంది.
సాధారణంగా సీతాఫలం రుచి తియ్యగా ఉంటుంది. ఈ కారణంగానే సీతాఫలాన్ని తీసుకోవాలంటే డయాబెటిస్‌తో బాధపడేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు. అయితే డయాబెటిస్‌తో బాధపడేవారు సీతాఫలాన్ని తీసుకోవచ్చా..? తీసుకుంటే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సీతాఫలంలో గ్లైసెమిక్ ఇండెక్స్ 54-55 మధ్యలో ఉంటుంది. దీంతో ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలపై నేరుగా ప్రభావం చూపుతుంది. సీతాఫలం తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ మరీ ఎక్కువ స్థాయిలో షుగర్ లెవల్స్ పెరుగుతాయన్నదాంట్లో నిజం లేదు. మోతాదుకు మించి కాకుండా రోజుకు ఒకటి, రెండు పండ్లను తీసుకుంటే పెద్దగా నష్టం ఉండదని నిపుణులు అంటున్నారు. మోతాదుకు మించి తీసుకోవడం వల్ల కేవలం డయాబెటిస్ మాత్రమే కాకుండా ఇతర సమస్యలు కూడా తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉంటే సీతాఫంలో విటమిన్ సి, బి6, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంలో కూడా సీతాఫలం ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ కడుపు ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.