Election Results 2024: ఏపీ ఎన్నికల ఫలితాలు.. కౌంటింగ్ లైవ్ అప్‌డేట్స్..
పిఠాపురం నియోజకవర్గం జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి 19139 ఓట్లు ఆదిక్యం
శ్రీకాకుళం ఎంపీ టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు 65746 ఓట్లతో ముందంజ
19వేల ఓట్ల ఆధిక్యంలో పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై దాదాపు 19 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
అమరావతి
టీడీపీ కేంద్ర కార్యాలయం చేరుకున్న చంద్రబాబు
భారీగా చేరుకున్న నేతలు కార్యకర్తలు
చంద్రబాబుకు ఘన స్వాగతం
సీఎం సీఎం అంటూ హోరెత్తిన నినాదాలు
మచిలీపట్నం కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్లిపోయిన గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని, గన్నవరం అభ్యర్థి వల్లభనేని వంశీ
21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన ముందంజ
తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి రెండు రౌండ్లు పూర్తి అయ్యేసరికి సరికి 126 ఓట్లతో ముందంజ.
పిఠాపురంలో 10,114 ఓట్ల ఆధిక్యంలో పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్‌లో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థులు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాలతో దూసుకుపోతున్నారు.
ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీ 91 స్థానాల్లో, జనసేన 11 స్థానాల్లో, బీజేపీ 2 స్థానాల్లో ముందంజలో ఉంది.
అధికార వైసీపీ ప్రస్తుతం 13 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది.
జగన్, బొత్స మినహా మంత్రులందరూ ఓటమి బాటలో కొనసాగుతున్నారు.
మంగళగిరిలో నారా లోకేష్
కుప్పంలో చంద్రబాబు
హిందూపురంలో బాలకృష్ణ
రాజమండ్రిలో పురందరేశ్వరి ముందంజ