Election Results 2024: ఏపీ ఎన్నికల ఫలితాలు.. కౌంటింగ్ లైవ్ అప్‌డేట్స్..
వైఎస్ జగన్ విజయం సాధించారు. పులివెందులలో జగన్ 61169 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి జగన్ మెజారిటీ 30 వేలు తగ్గడం గమనార్హం.
ఆత్మకూరులో టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి గెలుపు
సమీప వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి పై 6880 ఓట్ల మెజార్టీతో గెలుపు
నెల్లూరు నగరంలోని సంతపేటలో ఆనం నివాసం,ఆత్మకూరులో సంబరాలు చేసుకుంటున్న ఆనం అభిమానులు.
దశాబ్దం తర్వాత తిరిగి ఆత్మకూరులో ఆనం ప్రాతినిధ్యం
గుడివాడలో భారీ మెజారిటీతో గెలిచిన వేణిగండ్ల రాము
గుడివాడలో 17 రౌండ్ల్ ముగిసే సరికి మరియు పోస్టల్ బెలాట్ ఓట్లతో కలిపి 52000 మెజారిటీ
ఇరవై ఏళ్ల తర్వాత గుడివాడలో ఎగిరిన పసుపు జెండా
సర్వేపల్లిలో టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపు
సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై 15,994 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
రాజమండ్రిలో సిటీలో ఆదివాసు విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ పై 74 వేల మెజార్టీతో ఆదిరెడ్డి వాసు గెలుపొందారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఘన విజయం సాధించారు.
తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 69,169 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట స్థానంలో టీడీపీ విజయం
టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథ రాజుపై 22,076 ఓట్ల మెజార్టీతో గెలుపు
అనంతపురం జిల్లా ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ విజయం
తన సమీప వైసీపీ అభ్యర్థి వై. విశ్వేశ్వర రెడ్డిపై గెలుపు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన పార్టీ విజయం
జనసేన అభ్యర్థి పులపర్తి ఆంజనేయులు తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌పై 66,974 ఓట్ల తేడాతో గెలుపు
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావుపై టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం సాధించారు.