Election Results 2024: ఏపీ ఎన్నికల ఫలితాలు.. కౌంటింగ్ లైవ్ అప్‌డేట్స్..
జూన్ 9న అమరావతిలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు
నాలుగోసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
ఏపీలో బీజేపీ తొలి విజయం
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ తొలి విజయం నమోదు చేసింది.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ అభ్యర్థి, తన సమీప ప్రత్యర్థి ఎస్.సూర్యనారాయణరెడ్డిపై 20567 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఏపీ అసెంబ్లీ ఫలితాలు.. రెండో విజయమూ టీడీపీదే
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో విజయమూ తెలుగుదేశం పార్టీ నమోదు చేసింది. రాజమహేంద్రవరం (పట్టణం) టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి మాగంటి భరత్‌రామ్‌పై 55వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ శ్రేణులు సంబరాలు
తాడేపల్లి ఉండవల్లి కరకట్ట పై ఉన్న చంద్రబాబు నివాసంకు వెళ్ళే మార్గాలలో పోలీస్ చెక్ పోస్టు ఏర్పాటు
చంద్రబాబు నివాసం వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న పోలీసులు
బోణీ కొట్టిన టీడీపీ
తొలి విజయం నమోదు చేసుకున్న కూటమి
రాజమండ్రి రూరల్ కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం
చెల్లుబోయిన వేణుగోపాల్ పై విజయం
వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై 61వేల ఓట్ల మెజార్టీతో విజయం
చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదో రౌండ్ పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్ధి కిమిడి కళా వెంకట్రావు 868 ఓట్లతో ముందంజ.
వెనుకంజలో వైసీపీ అభ్యర్ధి బొత్స సత్యనారాయణ.
టెక్కలి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్ననాయుదు 4th రౌండ్ 1708 ఓట్లతో ముందంజ
మాచర్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జూలకంటిబ్రహ్మారెడ్డి 7 రౌండ్ పూర్తి 16957 అధిక్యం
కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వెళ్లిపోయిన జమ్మలమడుగు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి