టీడీపీ ఎంపీలు రాజీనామా చేయకపోతే కేంద్రంతో లాలూచీ పడినట్టేనన్నారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. హోదా సాధన కోసం మేం రాజీనామాలు చేస్తామని, టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని ఆయన సూచించారు. తాము అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్లే అన్ని రాజకీయ పార్టీలు అవిశ్వాసం అంటున్నాయని చెప్పారు. రాజకీయాలు పక్కనపెట్టి ప్రత్యేక హోదా కోసం కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు మిథున్‌రెడ్డి.