Free Bus Journey: ఏపీ మహిళలకు గుడ్ న్యూస్..ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఫ్రీ జర్నీకి ముహూర్తం ఖరారు..ఎప్పట్నుంచంటే?
Free Bus Journey: ఏపీలో కూటమి సర్కార్ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటి వరకు అమలు కానిది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ. తొలుత దీనిని సంక్రాంతి నుంచే అమలు చేయాలని కూటమి సర్కార్ భావించినప్పటికీ దీని సాధ్యాసాధ్యాలపై పలు అనుమానాలు ఉన్నాయంటూ అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ అనుమానాలను నివ్రుత్తి చేసుకునేందుకు ఇప్పటికే ఫ్రీ బస్సు స్కీం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక సమర్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
రాష్ట్రాల్లో పరిశీలన త్వరితగతిన పూర్తి చేసి సమగ్ర రిపోర్టును సమర్పించాలని కోరారు. ఇప్పటికే మహిళల ఫ్రీ బస్సు జర్నీ హామీ అమలు సాధ్యాసాధ్యాలపై పలు మార్చలు చర్చలు జరిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల నుంచి దీనికి సంబంధించిన సమాచారం తీసుకున్నారు. రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి, ఆ సంస్థ ఎండీ డీజీపీ ద్వారకా తిరుమలరావు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే తదితర అధికారులతో సొమవారం సచివాలయంలో జరిపిన సమీక్షసమావేశంలో ఈ మేరకు చర్చించారు.
మొదట సంక్రాంతి నుంచే ఫ్రీ బస్సు స్కీము అమలు చేయాలని అనుకున్నట్లు సీఎం చంద్రబాబు అడుగతా..జీరో టికెటింగ్ విధానం, ఇతర ఏర్పాట్లకు కొంత సమయం పడుతుందనీ...15రోజుల్లో వీటన్నింటినీ సిద్ధం చేయడం కష్టమని తెలిపారు. చంద్రబాబు స్పందిస్తూ ఈ స్కీం అమలు చేస్తున్న కర్నాటక, తెలంగాణ, ఢిల్లీలో పర్యటించి అక్కడి అమలు విధానం అధ్యయనం చేసి అనుమానాలను నివ్రుత్తి చేసుకుని రావాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ చర్చ అనంతరం ఉగాది నుంచి ఫ్రీ బస్సు జర్నీ అమలు చేయాలని సూత్రప్రాయంగానిర్ణయించారు. ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఎదరువుతున్న సమస్యలను గుర్తించాలి. ఆ సమస్యలు ఏపీలో రాకుండా ఉండేందుకు ఎలాంటి పరిష్కార మార్గాలను అనుసరించాలన్నదారిపై నివేదికను రెడీ చేయాలని సీఎం ఆదేశించారు.
దీనిలో భాగంగా జనవరి 3న కర్నాటక 6,7 తేదీల్లో ఢిల్లీలో పర్యటించి నివేదికను సమర్పించనున్నట్లు మంత్రి రాంప్రసాదరెడ్డి, చంద్రబాబుకు తెలిపారు. మొత్తంగా ఈ రిపోర్టు తర్వాత ఫ్రీ జర్నీపై రాష్ట్ర సర్కార్ అధికారిక ప్రకటన జారీ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాల సంఖ్య తక్కువనే చెప్పాలి. ఎందుకంటే గతంలో వైసీపీ అమలు చేసిన పలు స్కీములను కూటమి సర్కార్ మంగళం పాడేసింది. ఈ నేపథ్యంలో మహిళలకు ఫ్రీ బస్సు స్కీం అమలుకు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చుని సమాచారం.