Perni Jayasudha: రేషన్ బియ్యం కేసులో పేర్ని జయసుధకు మరోసారి నోటీసులు

Perni Jayasudha: పేర్ని జయసుధ (Perni Jayasudha) కు మచిలీపట్టణం పోలీసులు (Machilipatnam Police) బుధవారం నోటీసులు ఇచ్చారు.

Update: 2025-01-01 06:21 GMT

Perni Jayasudha: రేషన్ బియ్యం కేసులో పేర్ని జయసుధకు మరోసారి నోటీసులు

Perni Jayasudha: పేర్ని జయసుధ (Perni Jayasudha) కు మచిలీపట్టణం పోలీసులు (Machilipatnam Police) బుధవారం నోటీసులు ఇచ్చారు. రేషన్ బియ్యం (PDS Rice) మాయం కేసులో విచారణకు రావాలని ఆ నోటీసులో కోరారు. పోలీసులు వెళ్లిన సమయంలో జయసుధ ఇంట్లో లేరు. ఇంటి గోడకు నోటీసులు అంటించి వెళ్లారు పోలీసులు. జనవరి 1 మధ్యాహ్నం 2 గంటలు ఆర్ పేట పోలీస్ స్టేషన్ కు రావాలని ఆ నోటీసులో కోరారు. గత ఏడాది డిసెంబర్ 30న జయసుధకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.అయితే అదే సమయంలో విచారణకు సహకరించాలని కోర్టు దేశించింది.

జయసుధకు చెందిన గోడౌన్ లో నిల్వ ఉంచి రేషన్ బియ్యం మాయమయ్యాయి.గత ఏడాది నవంబర్ 27న తన గోడౌన్ లో 187 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైందని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులకు ఆమె లేఖ రాశారు.ఈ లేఖ ఆధారంగా అధికారులు డిసెంబర్ 4న సోదాలు చేశారు. ఈ 178 మెట్రిక్ టన్నులకు గాను రూ.1.68 కోట్లను చెల్లించారు. అయితే ఈ గోడౌన్ నుంచి 387 మెట్రిక్ టన్ను రేషన్ బియ్యం మాయమైందని అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి 1.67 కోట్లు చెల్లించాలని గత ఏడాది డిసెంబర్ 30న నోటీసులు జారీ చేశారు.

ఇదే కేసులో డిసెంబర్ 31న జయసుధ భర్త మాజీ మంత్రి పేర్నినానిపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 6 వరకు పేర్నినానిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది.

రేషన్ బియ్యం కేసులో రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. మంత్రి కొల్లు రవీంద్రపై ఆయన పరోక్షంగా ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను కొల్లు రవీంద్ర తోసిపుచ్చారు. తన భార్యను అడ్డుపెట్టుకొని సానుభూతిపొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

Tags:    

Similar News