Kakinada: కానిస్టేబుళ్ల పైనుంచి దూసుకెళ్లినకారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు
Kakinada: నూతన సంవత్సరం సందర్భంగా వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఓ కారు డ్రైవర్ తమ కారును కానిస్టేబుళ్లను ఢీకొట్టి ముందుకు వెళ్లింది.
Kakinada: నూతన సంవత్సరం సందర్భంగా వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఓ కారు డ్రైవర్ తమ కారును కానిస్టేబుళ్లను ఢీకొట్టి ముందుకు వెళ్లింది. ఈ ఘటన కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరంలో జరిగింది. కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో జాతీయ రహదారిపై టోల్ ప్లాజా వద్ద డిసెంబర్ 31 రాత్రి జరిగింది.
విశాఖ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న కారును పోలీసులు ఆపారు. అయితే రోడ్డు పక్కన కారును ఆపుతున్నట్టుగా పోలీసులను నమ్మించి వేగంగా ముందుకు పోనిచ్చారు. దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లను ఢీకొట్టుకొంటూ కారు ముందుకు వెళ్లింది. దీంతో వీరిద్దరూ గాయపడ్డారు. గాయపడిన కానిస్టేబుళ్లను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. రాజానగరం సమీపంలో కెనాల్ వద్ద కారును దుండగులు వదిలిపెట్టారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులు కారులో గంజాయిని తరలిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరో వైపు సంఘటన జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించనున్నారు. ఈ ఘటన జరిగినా కూడా సీఐ ఉన్నతాధికారులు ఎందుకు సకాలంలో సమాచారం ఇవ్వలేదనే విషయమై కూడా అంతర్గత విచారణ కూడా నిర్వహించనున్నారు.