Borugadda Anil Kumar: బోరుగడ్డ అనిల్ కు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ

బోరుగడ్డ అనిల్ కు (Borugadda Anil)ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (Andhra Pradesh High Court)ఎదురు దెబ్బ తగిలింది.

Update: 2025-01-02 06:52 GMT

Borugadda Anil Kumar: బోరుగడ్డ అనిల్ కు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ

బోరుగడ్డ అనిల్ కు (Borugadda Anil)ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (Andhra Pradesh High Court)ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను (Bail Petition) కోర్టు కొట్టింేసింది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని కోర్టు వ్యాఖ్యలు చేసింది.

పిటిషనర్ నేర చరిత్ర కలిగి ఉన్నారని కోర్టుకు పోలీసులు చెప్పారు. ప్రాసిక్యూషన్ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు.ఇలాంటి కేసుల్లో నిందితులను క్షమించడానికి వీల్లేదని కోర్టు అభిప్రాయపడింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసుల్లో నమోదైన రెండు కేసుల్లో ఆయనపై చార్జీషీట్ దాఖలు చేసిన విషయాన్ని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయమై అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.

2023 అక్టోబర్ 17న బోరుగడ్డ అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెదిరింపుల కేసులో ఆయనను అరెస్ట్ చేశారు.వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై టీడీపీ నాయకులు ఆరోపించారు. అనిల్ పై 15 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

అమరావతి రాజధాని విషయంలో అప్పట్లో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సోషల్ మీడియాలో జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బోరుగడ్డ అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో తాము ఇచ్చిన ఫిర్యాదులను అప్పట్లో పోలీసులు పట్టించుకోలేదని గతంలో టీడీపీ ఆరోపణలు చేసింది.  అరెస్టు చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ లో కూడా అనిల్ కు సౌకర్యాలు కల్పించారని ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన సీసీటీవీ పుటేజీ కూడా వెలుగు చూసింది. ఈ సీసీటీవీ పుటేజీ మీడియాకు విడుదల కావడానికి కారణమైన వారిని మూడు రోజుల క్రితం గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News