CM Chandrababu: కొత్త సంవత్సరం వేళ..ఏపీలో కొత్త పథకాలు..శుభవార్త చెప్పిన ఏపీ సీఎం

Update: 2025-01-01 02:20 GMT

CM Chandrababu: ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్న వేళ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కీలకమైన ట్వీట్ చేశారు. అందులో చాలా విషయాలను ప్రస్తావించారు. ఆయన ఏం చెప్పినా.. సుదీర్ఘంగా చాలా విషయాలు చెప్పడం మనం చూస్తూ ఉంటాము. తన అనుభవంతో సుదీర్ఘ ప్రసంగాలు చేయడం చాలా వరకు చూసాము. అలాగే ఆయన కొత్త సంవత్సరం సందర్భంగా చేసిన ట్వీటులో లోతైన అంశాలను ప్రస్తావించారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్ లో ఒక విషయం అందరిని ఆకట్టుకుంటుంది. కొత్త సంక్షేమ పథకాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు 2025వ సంవత్సరం వేదిక కాబోతుంది అని అన్నారు. ఇది కోట్లాది మందిలో కొత్త ఆశలు చిగురింప చేసే మాట. ఏపీ ప్రజలు సూపర్ సిక్స్ పథకాలు అమలు కోసం ఎదురుచూస్తున్నారు. వాటిలో ఒకటైన ఫ్రీ బస్సు స్కీమ్ ఉగాదికి వస్తుందని అంచనా. ఇక తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు 1500 వంటి కీలకమైన హామీలు కూడా ఉన్నాయి. వాటిని ఈ కొత్త ఏడాదిలోనే ప్రారంభిస్తారని అంచనాల మధ్య ప్రజలు ఉన్నారు.


చంద్రబాబు నాయుడు చేసిన ఈ ట్వీట్ ను బట్టి చూస్తుంటే.. ప్రభుత్వం ఆరు నెలల పాలనపై ఆయన సంతృప్తిగా ఉన్నారని అర్థమవుతుంది. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా చేసి చూపించామని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఇదివరకు ఆయన సంక్షేమంపై పెద్దగా ఫోకస్ పెట్టేవారు కాదు. కానీ ఈసారి పేదలకు ఏదో ఒకటి చేస్తూ వారి ఇళ్లకు వెళ్లి మరీ కష్టసుఖాలను తెలుసుకుంటున్నారు. అది ఆయనలో కనిపిస్తున్న మార్పు అని చెప్పవచ్చు. ప్రజల చెంతకు నేతలు ఎంత ఎక్కువగా వెళితే అంతగా క్షేతస్థాయిలో సమస్యలు తెలుస్తాయని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. అందువల్ల ప్రభుత్వం త్వరలోనే కొత్త పథకాలు అమలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

అయితే చంద్రబాబు నాయుడు ట్వీట్ కు నెటిజన్లు కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. వారు కూడా ఆయనకు విషెస్ చెబుతున్నారు. ఆయన మరింత ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. కొంతమంది మాత్రం తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. వాటిపై కూడా దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు. మరి కొంతమంది సూపర్ సిక్స్ స్కీములని అమలు చేయాలని కోరుతున్నారు.

Tags:    

Similar News