Perni Nani: ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్
పేర్నినాని(Perni Nani) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (Andhra Pradesh ) ముందస్తు బెయిల్ పిటిషన్ (Anticipatory Bail) ను మంగళవారం దాఖలు చేశారు.
పేర్నినాని(Perni Nani) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (Andhra Pradesh ) ముందస్తు బెయిల్ పిటిషన్ (Anticipatory Bail) ను మంగళవారం దాఖలు చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో ఏ6గా పేర్నినానిపై మచిలీపట్టణం పోలీసులు కేసు నమోదు చేశారు.పేర్ని నాని భార్య జయసుధకు చెందిన గోడౌన్ లో రేషన్ బియ్యం మాయమైన విషయాన్ని అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఏ2 నుంచి ఏ 5 వరకు ఉన్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఏ1గా ఉన్న జయసుధకు కోర్టు డిసెంబర్ 30న ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
పేర్నినాని భార్య పేరున ఉన్న గోడౌన్ లో 378 మెట్రిక్ టన్ను రేషన్ బియ్యం మాయమైన విషయాన్ని అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి రూ.1.67 కోట్లు చెల్లించాలని పేర్ని జయసుధకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో గోడౌన్ మేనేజ్ మానసతేజ, సివిల్ సప్లయిస్ శాఖ మేనేజర్ కోటిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. బియ్యం షార్టేజీ కేసులో ముందుజాగ్రత్తగా సివిల్ సప్లయిస్ శాఖ మేనేజర్ కోటిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని పోలీసులు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టారు. నవంబర్ లో కాకినాడ పోర్టులో ఆఫ్రికాకు తరలించేందుకు సిద్దంగా ఉన్న స్టెల్లా నౌకను సీజ్ చేశారు. కాకినాడ పోర్టును అప్పట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు.