Perni Nani: రేషన్ బియ్యం కేసులో పేర్ని నానిపై కేసు నమోదు

పేర్నినాని(Perni Nani) పై రేషన్ బియ్యం (Ration Rice) మాయం కేసులో మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

Update: 2024-12-31 06:00 GMT

Perni Nani: రేషన్ బియ్యం కేసులో పేర్ని నానిపై కేసు నమోదు

పేర్నినాని(Perni Nani) పై రేషన్ బియ్యం (Ration Rice) మాయం కేసులో మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్టణం పోలీస్ స్టేసన్ లో నమోదైన కేసులో ఆయన పేరును ఏ 6 గా చేర్చారు. ఇదే కేసులో పేర్ని నాని భార్య జయసుధకు నిన్న కోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మరో వైపు ఈ కేసులో గోడౌన్ మేనేజర్ మానస తేజ, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లు యజమాని బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగరాజు లకు కోర్టు 12 రోజుల రిమాండ్ విధించింది.

అసలు ఏం జరిగింది?

పేర్ని నాని భార్య జయసుధకు చెందిన గోడౌన్ లో 185 మెట్రిక్ టన్ను రేషన్ బియ్యం షార్టేజ్ వచ్చిందని పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి పేర్ని నాని రూ. 1.68 కోట్ల జరిమానా చెల్లించారు. దీనిపై సివిల్ సప్లయ్ శాఖ అధికారులు విచారణ జరిపారు. 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమయ్యాయని అధికారులు గుర్తించారు. దీనిపై సివిల్ సప్లయిస్ కు చెందిన అధికారులు నోటీసులు జారీ చేశారు. షార్టేజీ బియ్యానికి రూ.1.67 కోట్ల చెల్లించాలని పేర్ని జయసుధకు అధికారులు నోటీసులు ఇచ్చారు.

సివిల్ సప్లయిస్ మేనేజర్ కోటిరెడ్డి అరెస్ట్

ఇదే కేసులో గోడౌన్ మేనేజర్ మానస తేజ, కృష్ణా జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ కోటిరెడ్డిని పోలీసులు డిసెంబర్ 30న అరెస్ట్ చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో కోటిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పేర్ని నాని దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ లో ఆమెకు ఊరట లభించింది.ఈ కేసులో ఏ1 గా పేర్ని నాని భార్య జయసుధ పేరును పోలీసులు చేర్చారు.ఇదే కేసులో ఏ2 నుంచి ఏ 5 వరకు ఉన్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.నిందితుల నుంచి సేకరించిన స్టేట్ మెంట్ ఆధారంగా పేర్నినాని పై కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి నగదు చెల్లింపుల విషయాన్ని పోలీసులు గుర్తించారు. పోన్ పే, ఆన్ లైన్ బ్యాంక్ లావాదేవీలను సేకరించారు.

Tags:    

Similar News