Perni Nani: ఏపీ హైకోర్టులో పేర్నినానికి ఊరట

పేర్ని నాని(Perni Nani)పై జనవరి 6వరకు తొందరపాటు చర్యలు వద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh) మంగళవారం ఆదేశించింది.

Update: 2024-12-31 10:37 GMT

Perni Nani: పేర్ని నాని(Perni Nani)పై జనవరి 6వరకు తొందరపాటు చర్యలు వద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court) మంగళవారం ఆదేశించింది. తన భార్య పేరున ఉన్న గోడౌన్ లో రేషన్ బియ్యం మాయమైన ఘటనలో పేర్నినానిని ఏ6 గా చేర్చారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డిసెంబర్ 31న పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు సోమవారం వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది.

ఇదే కేసులో నాని భార్య జయసుధ (Perni Jayasudha)ఏ1గా ఉన్నారు. ఆమెకు డిసెంబర్ 30 కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 13న ఆమె ముందస్తు బెయిల్(Anticipatory Bail) పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ చేసిన కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. జయసుధకు చెందిన గోడౌన్ లో నిల్వ ఉంచి రేషన్ బియ్యంలో 378 మెట్రిక్ టన్నుల బియ్యం తక్కువగా ఉందని అధికారులు గుర్తించారు. ఈ బియ్యం షార్టేజీపై ఇప్పటికే రూ.1.68 కోట్లు ఫైన్ కట్టారు. ఇంకా రూ.1.67 కోట్లు కట్టాలని సివిల్ సప్లయిస్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

పేర్నినాని భార్య జయసుధ గోడౌన్ లో సివిల్ సప్లయిస్ శాఖ బియ్యం నిల్వ చేస్తారు. అయితే ఈ గోడౌన్లో నిల్వ చేసిన రేషన్ బియ్యం(PDS Rice) మాయమైంది. ఇదే విషయమై ఈ ఏడాది నవంబర్ చివర్లో ఆమె సివిల్ సప్లయిస్ శాఖ అధికారులకు లేఖ రాశారు. డిసెంబర్ 4న అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో బియ్యం తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించి కేసు నమోదు చేశారు. మాయమైన బియ్యానికి సంబంధించి ఇప్పటికే 1.68 కోట్లు ఫైన్ ను చెల్లించారు. అయితే మొత్తం 378 మెట్రిక్ టన్నుల బియ్యం తక్కువగా ఉందని అధికారులు లెక్కతేల్చారు. దీంతో మరో రూ. 1.67 కోట్లు కట్టాలని డిసెంబర్ 30న నోటీసులిచ్చారు.

Tags:    

Similar News