Ration Card: మహిళలకు గుడ్ న్యూస్ ..రేషన్ కార్డు ఉంటే చాలు..రోజుకు రూ. 2000పొందవచ్చు..ఎలాగో తెలుసా?
Ration Card: మహిళలకు అద్భుతమైన అవకాశం. రేషన్ కార్డు ఉంటే చాలు. చదువుతూ అవసరం లేదు. రోజుకు 2వేల రూపాయలు సంపాదించవచ్చు. ఎలాగో తెలుసుకోవాలా అయితే ఈ స్టోరీ చూద్దాం.
Ration Card: మహిళలకు అద్భుతమైన అవకాశం. రేషన్ కార్డు ఉంటే చాలు. చదువుతూ అవసరం లేదు. రోజుకు 2వేల రూపాయలు సంపాదించవచ్చు. ఎలాగో తెలుసుకోవాలా అయితే ఈ స్టోరీ చూద్దాం.Ration Card: ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా.. కెనరా బ్యాంక్ స్వయం ఉపాధి శిక్ష సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తూ కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. దీనిలో భాగంగానే గ్రామీణ ప్రాంతంలో నివసించే మహిళలు వారి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటు అందించే విధంగా ఇంట్లోనే ఉంటూ ఉపాధి అవకాశాలు పొందే విధంగా జరదోసి మగ్గం వర్క్ ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు కెనరా బ్యాంక్ ఉపాధి శిక్ష సంస్థ రీజినల్ మేనేజర్ తెలిపారు.
తమ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగ యువకులకు ఎలాంటి విద్యా లేకపోయినా సరే కేవలం చదవడం. రాయడం వస్తే చాలు ..స్వయం ఉపాధి పొందుతూ డబ్బులు సంపాదించుకునేందుకు వీలుగా.. పలు అంశాలతో ఉచిత ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. వారికి థియరీ పరంగాను ప్రాక్టికల్ పరంగాను శిక్షణ ఇస్తున్నట్లు శిక్షణకు సంబంధించిన అన్ని మెటీరియల్ తామే ఉచితంగా అందిస్తున్నామని ఆయన తెలిపారు. అంతేకాదు నెల రోజులపాటు ఉంటే ఈ ట్రైనింగ్ కాలంలో అభ్యర్థులకు ఫ్రీ భోజనం, వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు
ఇందులో భాగంగానే మహిళలకు ఎంతగానో ఇష్టపడే మగ్గం వర్క్ పై ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకున్న కొంత మంది విద్యార్థులు మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు డబ్బు సంపాదించడానికి మగ్గం వర్క్ ఎంత ఉపయోగపడుతుంది అన్నారు. ప్రస్తుతం మహిళలు మగ్గం వర్క్ చేసిన బట్టలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. కాబట్టి మగ్గం వర్క్ అనేది గ్రామీణ ప్రాంత మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
సాధారణంగా మగ్గం వర్క్ నేర్చుకోవాలంటే.. బయట దాదాపు 35వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ కెనరా బ్యాంక్ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా కేవలం నెల రోజుల్లోనే మగ్గం వర్క్ ఒకటే ఇంకా నాలుగు రకాల ఎంబ్రాయిడరీ వర్క్స్ వంటి నేర్పిస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా శిక్షణ తీసుకున్న వరకు తర్వాత రెండు వేల వరకు సంపాదించవచ్చని తెలిపారు. రేషన్ కార్డ్ ఆధార్ కార్డు వంటి ఉన్న మహిళలకు ఈ ట్రైనింగ్ నేర్చుకోవడానికి అర్హులు తెలిపారు.